ధర్మ మార్గములో నడిచే ప్రయత్నం కొరకు ఈ చానెల్ నిర్వహిస్తున్నాము. 84 లక్షల జన్మలు అందులో ఈ మానవ జన్మ ఉత్తమమైనది. ఎందుకంటే ఇంతటి వివేకము, ఇటువంటి దేహము మరల రాదు. అన్ని జన్మలలోను పరమ పురుషార్ధము కలిగిన జన్మము ఈ మానవ జన్మమె. 1. ధర్మము, 2. అర్థము, 3. కామము అన్ని జీవరాసులతో కలిపి మానవ జన్మమునకు ఉన్నను, ఉత్కృష్టమైన ఈ వివేకము కారణమున మోక్షము అనే పరమ పురుషార్థము కలుగునవకాశము ఈ మానవ జన్మమునకు యేర్పడుచున్నది. కావున ముముక్షువులు గురు కరుణను పొంది కడతేరగలరు.