భావతరంగిణి యూట్యూబ్ ఛానల్ గురించి రెండు మాటలు
1998లో భావ తరంగిణి సాంస్కృతిక మాస పత్రిక ప్రారంభించి, అంటే ఇరవై రెండున్నర సంవత్సరాల పాటు నిర్విరామంగా విజయవంతంగా నిర్వహించాను. భవిష్య అనే కలం పేరుతో నే నేను తొలినుండి రచనలు ప్రారంభించాను అందువల్ల భవిష్య గానే అందరికీ పరిచయం పత్రిక పెట్టిన తర్వాత భావ తరంగిణి భవిష్య గా పరిచయం అలా భావ తరంగిణి భవిష్య గా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చింది నా అసలు పేరు జె వి రమణ రావు
ప్రతి ఏడాది భావ తరంగిణి వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించి ఎంతో మంది బాల యువ కళాకారుల ప్రదర్శనలు సత్కారాలు అలాగే ఎందరో సాహితీ కళా రంగ ప్రముఖులకు పురస్కారాలు అందించి గౌరవించాము
రచయితగా నటుడిగా నాటక దర్శకుడుగా వ్యాఖ్యాతగా పత్రిక సంపాదకుడు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకుడుగా ఉన్నందువల్ల ఈ రోజున నేను పెట్టిన ఛానల్లో కూడా రాజకీయాలకు ఇతర విషయాలకు ఏమాత్రం సంబంధం లేకుండా సాహితీ సాంస్కృతిక ధార్మిక కార్యక్రమాలు మాత్రమే దీంట్లో ఉంటాయి
వీటి పట్ల అభిరుచి కలిగినటువంటి మిత్రులందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అన్ని కార్యక్రమాలు చూస్తూ మీ విలువైన సలహాలు సూచనలు కూడా అందిస్తూ ఉండండి
నమస్తే భవిష్య