in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
🙏 శనీశ్వరుని పట్టిన హనుమ..!!
శనీశ్వరుడు ఎవరి జాతకంలోనైనా ఏడున్నర సంవత్సరాలు ఉంటే ఆ కాలాన్ని "ఏలిన నాటి (ఏల్నాటి)శని" అంటారు.
ఈ దశ ప్రభావం త్రిమూర్తుల మొదలు సామాన్యుల వరకు తప్పనిసరి. ఒక సమయంలో హనుమంతునికి ఏల్నాటి శనిగ్రహ కాలం వచ్చింది.
శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు. అక్కడ వానరులందరూ సేతువు నిర్మాణానికి బండలను తీసుకుని వచ్చి పడవేస్తున్నారు.
హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతున్నాడు,
శ్రీ రాముడు ఒక బండ మీద ఆశీనుడై పర్యవేక్షిస్తున్నాడు.
అప్పుడు శనీశ్వరుడు వచ్చి "నేను హనుమంతుని పట్టుకొనే కాలం వచ్చింది" అని శ్రీ రాముని అనుమతి అడిగాడు, అపుడు రామయ్య నన్నెందుకు అడగడం....నీ విధిని నీవు చెయ్యి"అని అన్నాడు .
అపుడు శని హనుమంతుని వద్దకు వెళ్ళి "నేను నీ వద్ద ఏడున్నర సంవత్సరాలు ఉండబోతున్నాను" అనగా .... నేను రామ కార్యంలో నిమగ్నమై ఉన్నాను అంత కాలం కుదరదన్నాడట హనుమ.
అయితే శని ప్రస్తుతానికి ఏడున్నర మాసాలు ఉంటా, సరేనా అన్నాడు హనుమ ఒప్పుకోలేదు!!!
అటు పై ఏడున్నర వారాలు అన్నా ససేమిరా అన్నాడు హనుమ.
హనుమంతుడు రామనామం ఆపకుండా జపిస్తూనే ...ఏడు క్షణాలు మాత్రం తనను పట్టుకోవాలసిందిగా కోరాడు.
అప్పుడు శనీశ్వరుడు "నీ కాళ్ళలో ప్రవేశించనా" అని అడిగాడు , హనుమంతుడు "వద్దు!!సేతువు కట్టడానికి రాళ్ళను తేవాలి..పరిగెత్తాలన్నా, నడవాలన్నా కాళ్ళు అవసరం" అన్నాడు.
సరి, నీ చేతులు పట్టుకోనా అన్నాడు శనీశ్వరుడు
ఆ రాళ్ళని చేతులతోనే కదా మోసి తెస్తున్నాను చేతులు పట్టుకోవద్దు. అన్నాడు హనుమంతుడు!!
అయితే నన్ను ఏం చెయ్యమంటావు ? నీ భుజాల పైన ఎక్కమంటావా" అన్నాడు శనీశ్వరుడు.
దానికి సమాధానంగా రామలక్ష్మణులను నా భుజాల మీద ఎక్కించుకుని వెడుతున్నాను , కనుక భుజాలు ఎక్కడానికి వీలులేదు,అన్నాడు హనుమ.
పోనీ, నీ హృదయం లో వుండవచ్చునా? అని అడిగాడు శనీశ్వరుడు .... హృదయంలో, మహాలక్ష్మీ స్వరూపిణి అయిన సీతాదేవి, నా దేవుడైన శ్రీరాముడు నిరంతరంగా నివసిస్తూ వున్నారు..అక్కడ నీకు చోటు లేదు,అన్నాడు హనుమ.
సరే, చివరకు నీ శిరస్సు ఒక్కటే ఖాళీగా వున్నది.
అక్కడే వుంటాను"అని శనీశ్వరుడు, హనుమంతుని శిరస్సు పైన ఎక్కి కూర్చున్నాడు.
హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని
తన శిరస్సు పై(అంటే శనీశ్వరుని మీద) పెట్టుకుని ఒక్కొక్కటిగా సముద్రంలో వేస్తున్నాడు,ఆ బండరాళ్ళ బరువు మోయలేక శనీశ్వరుని కనుగుడ్లు బయటకు వచ్చాయి...మరో పెద్ద బండరాయి హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే, శనీశ్వరునికి ఊపిరి సలపక
గిలగిలలాడాడు.
హనుమంతుడు ఆ రాయిని సముద్రంలో వేసిన తక్షణమే శనీశ్వరుడు హనుమ శిరస్సుపై నుండి కిందకి దూకేసి... మారుతీ, నీ వల్ల నాకు
శ్రీ రాముని సేవించుకునే భాగ్యం కలిగినది,నిన్ను నేను పట్టలేను...అంటూ ఒకే పరుగుపెట్టాడు శనీశ్వరుడు.
హనుమంతుని ముందా కుప్పిగంతులు!!!!!
నిర్మల భక్తితో , నిశ్చల మనస్సుతో శ్రీ రాముని సేవలో నిమగ్నమైయున్న ఎవరిని కూడా శనీశ్వరుడు
రెండు క్షణాలు కూడా పట్టుకొనలేడు అని ప్రాచుర్యం లో ఉన్న ఈ కథా సారంశం !!!!
పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం *శ్రీరామనామం* జపిస్తే కష్టాల నుండి విముక్తి కలిగితీరుతుంది...!!!!A Best Collection from Brahmana Samaakya.
🙏🏾🙏🏾🙏🏾
🚩జై శ్రీరామ్ 🙏
🚩జై భజరంగభళీ 🙏
1 - 0
Om Sree matray namaha🙏🙏🌹💐# YouTube shorts # temple # viral # video # stutas
youtube.com/@sarisuri?si=Xd39bMYSGMUi4xIC
5 - 0
माँ दुर्गा स्तुति मंत्र/ jai Durga maa 🙏🙏💐💐🌹
Happy Friday
youtube.com/@sarisuri?si=Xd39bMYSGMUi4xIC
2 - 0
Welcome to my channel @chaitra honey for creators
@sarisuri language and based cooking videos arts and crafts, travel, places,new creation etc...
Subscribe and join us @ Chaitra honey
www.youtubeshorts
www.youtube cart
www.youtube.videos
www.youtube cooking videos/
www.youtube.art