Promotion of Feel Good Poetry . It is a people's movement
మానవ సంబంధాలను బలోపేతం చేసేందుకు, మానవీయ విలువల్ని సుసంపన్నం చేసేందుకు, అనుబంధాలు, ఆత్మీయతలను మనసుల నిండా నింపేందుకు, భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను నేటి తరానికి హృదయానికి హత్తుకునేలా పరిచయం చేసేందుకు ఫీల్ గుడ్ పోయట్రీ అధ్బుతంగా ఉపకరిస్తుంది.
సమాజం అంటే మానవ సంబంధాల సమ్మిళితం. కుటుంబం అనే పునాది వేసుకొని, బంధాలు, అనుబంధాలు, అనురాగాలు, ఆత్మీయతలు, స్నేహ సౌభ్రాతృత్వాలు, నైతిక విలువలనే ఇటుకలుగా చేసుకొని ప్రపంచమనే మహాసౌధాన్ని నిర్మించుకున్న మనిషి, ఇప్పుడు వర్చ్యువల్ ప్లానెట్ మాయాలోకంలో జీవిస్తూ ఒంటరి వాడయ్యాడు. నగరీకరణ పుణ్యమా అని నవతరం ఉమ్మడి కుటుంబ ఆప్యాయతానురాగాలకు నోచుకోలేకపోతున్నది.
విశ్వ సాహితీ ట్రస్ట్, ఫీల్ గుడ్ పోయెట్రీ ద్వారా కొడగడుతున్న మానవ సంబంధాలను దేదీప్యమానంగా వెలిగించే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియో పోటీలను నిర్వహిస్తుంది. ప్రాచీన విలువలను, సంప్రదాయాలను మరువకుండా కాపాడుకుందాం,
భావితారాల వారికి మానవ సంబంధాలు అనే అమూల్యమైన నిధిని వారసత్వ సంపదగా అందజేద్దాం.
సర్వేజనా సుఖినో భవంతు ...