in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎలా జరుపుకుంటారు..!?
#krishnashtami #janmashtami #lordsrikrishna #srikrishnajayanthi
కృష్ణాష్టమి రోజున సూర్యోదయానికి పూర్వమే కాలకృత్యాలు తీర్చు కుని, తలస్నానం చేసి, పసుపురంగు బట్టలు వేసుకోవాలి. ఇంటిని శుభ్రపరచుకుని అవుపేడతో అలికి అందమైన రంగవల్లులు తీర్చిదిద్దాలి. గడపకు పసుపుకుంకుమ, గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టుకోవాలి. కృష్ణుడు ఇంట్లోకి వస్తున్నట్టుగా పాదాలు చిత్రించుకోవాలి.
కృష్ణాష్టమి వేళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక పూజ చేయడం మంచిది. పూజా స్థలంలో బియ్యం రాశిగా పోసి కొత్త వస్త్రాన్ని దానిపై వేసి మంటపం ఏర్పాటు చేసుకుని కొత్త కుండను గంధం, పువ్వులు, అక్షతలతో అలంకరించి మంటపంపై పెట్టుకోవాలి. ఆ కుండకు వస్త్రం చుట్టి దానిపై బాలకృష్ణుని ప్రతిమను పెట్టుకోవాలి. ఈ సమయంలో కంచు దీపంలో కొబ్బరినూనె పోసి ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించాలి. నుదుటిన బొట్టు పెట్టుకుని, తూర్పు వైపునకు తిరిగి “ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః’’ అనే మంత్రాన్ని 108సార్లు జపించాలి.
పఠించాల్సిన శ్లోకాలు
ఈరోజు ముఖ్యంగా స్వామికి సంబంధించిన అష్టోతరం, బాలకృష్ణా స్తోత్రం, శ్రీకృష్ణ సహస్రనామాలు, శ్రీ శ్రీమద్భాగవతంలోని దశమస్కందం చదవాలి. తరువాత శ్రీకృష్ణుడికి ఇష్టమైన పాలు, పెరుగు, వెన్న, మీగడ నివేదించాలి. ఈ రోజున ఉపవాసం ఉండి, రాత్రి శ్రీకృష్ణుడి లీలలు, కథలతో జాగరణ చేసి మరుసటి రోజున భోజనం చేయాలి. కృష్ణాష్టమి రోజున ఆలయాలలో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామ పూజ చేయించినవారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అని పండితులు, పురోహితులు తెలియజేస్తున్నారు.
స్కాందపురాణం ప్రకారం కృష్ణాష్టమి రోజున కృష్ణుడిని అర్చిస్తే సకల పాపాలు తొలగిపోతాయని, ధర్మార్థ కామమోక్ష ప్రాప్తి కలుగుతాయి. కృష్ణాష్టమి రోజున బంగారంతో కాని, వెండితో కాని చంద్రబింబాన్ని పూజించి అర్ఘ్యం యిస్తే సకల కోరికలు తీరుతాయని భవిష్యోత్తర పురాణం తెలియజేస్తుంది. అలాగే ఈ రోజున భీష్మాచార్యులను అర్చించి పూజిస్తే సకల పాపాలు పోతాయని పండితులు పేర్కొంటున్నారు.
స్వామిని ఆరాధించేటప్పుడు మనసు ఆయన మీద పెట్టి శ్రద్ధతో ఆయన నామ కీర్తన, స్మరణ చేయాలి. ఉపవాసం ఉండటం అనేది ఆరోగ్య పరిస్థితులను బట్టి చేయాలి. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగగ్రస్తులు ఉపవాసం ఉండకూడదు.
1 - 0
#గురుపూర్ణిమ శుభాకాంక్షలు.. 💐🙏 #గురుపౌర్ణమి విశిష్టత #gurupournami
మనం ఏ రంగంలో విజయం సాధించాలన్నా.. ఉన్నత స్థాయికి ఎదగాలంటే గురువు యొక్క శిక్షణ తప్పనిసరి. మన నైపుణ్యాలను మరింత మెరుగుపరిచి మనలోని వివేక జ్యోతిని వెలిగించి ప్రగతి పథంలో నడిపించేవాడు గురువు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో గురువు అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు.
ఈ లోకంలో ప్రతి ఒక్కరికి తొలి గురువు తల్లి. ఆ తర్వాత మనకు వివేకజ్యోతిని వెలిగించి.. మనకు ఏది మంచి.. ఏది చెడు అనే విషయాలను చెప్పే వారే గురువులు. అలాంటి గురువులను పూజించడం కోసం నిర్ణయించిన తిథి గురు పూర్ణిమ. గురులో గు అంటే అంధకారం లేదా అజ్ణానం, రు అంటే నిరోధించుట లేదా తొలగించుట అని అర్థం. గురువు అనే పదానికి అజ్ణానాన్ని తొలగించే వారు అని అర్థం.
పురాణాల ప్రకారం, వేదాలను నాలుగు భాగాలుగా విభజించి, వేద వాగ్మయాలను సామాన్యుడి చెంతకు చేరేలా చేయడంలో వ్యాసుడు ఎంతో క్రుషి చేశాడు. పంచమ వేదంగా పేరు తెచ్చుకున్న మహా భారతాన్ని మనకు అందించిన వ్యాసుడు పుట్టినరోజు కాబట్టి ఆరోజు గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమగా పాటిస్తున్నారు.
గురు పూర్ణిమ రోజున గురువు అనుగ్రహం పొందేందుకు ఆ పవిత్రమైన రోజున ప్రత్యేక పూజలు, జపం, హోమం, దాన ధర్మాలు, ఆధ్యాత్మిక చింతన ద్వారా గురుబలాన్ని పెంచుకుని, గురు గ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందండి. వేదాల్లో, పురాణాల్లో, శాస్త్రాల్లో వర్ణించిన గురుతత్వాన్ని అన్వేషించి, ఆరాధించి, ఆనందాన్ని, ఆదాయాన్ని పొందండి.
గురు పూర్ణిమ రోజున వీలైనంత వరకు దక్షిణా మూర్తి ఆరాధన చేయడం, దత్తాత్రేయ ఆరాధన చేయడం మంచిది. శ్రీహయగ్రీవాయ నమః జపం చేసుకోవడం కూడా మంచిదే. విద్యార్థులు, చదువుకునే వారందరూ ఈ జపం నిరంతరం చేయాలి. ఈరోజునే వేదాన్ని బ్రహ్మదేవుడు తన కుమారుడైన వశిష్ట మహర్షికి, ఆయన తన కుమారుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశాడు. శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు.
పూజా విధానం..
వ్యాస పూర్ణిమ రోజున కొత్త బట్టలను ధరించాలి. అలాగే కొత్త దుస్తులపై బియ్యం, నిమ్మకాయలు ఉంచాలి. అలా చేస్తే శంకరులు తన శిష్యులు వచ్చి దానిని అందుకుంటారని పండితులు చెబుతారు. పూజ పూర్తైన తర్వాత బియ్యం తీసుకెళ్లి పిడికెడు చొప్పున తమ ఇళ్లల్లో బియ్యం కలుపుతారట. బియ్యం, కొత్త బట్టలు లక్ష్మీ చిహ్నం. నిమ్మపండ్లు కార్యసిద్ధికి సూచన.
3 - 0
ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు... 💐💐
యోగా మన శరీరం గురించి నేర్పుతుంది. యోగా బాగా శ్వాస తీసుకోవడం ఎలాగో నేర్పుతుంది. యోగా మన శక్తిని మరింత సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలో నేర్పుతుంది. మనసును ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలో యోగా నేర్పుతుంది.
శ్వాసను కాసేపు పీల్చి వదలకుండా ఉండటం వల్ల గుండె , ధమనులను ఆరోగ్యంగా ఉంచుతాయి. యోగా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే రక్తం గడ్డకట్టకుండా కాపాడడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
యోగా ఒత్తిడిని తగ్గిస్తుంది. ముఖ్యంగా విరామం లేని పని చేసిన తర్వాత యోగా చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ఒక్కటే మార్గం కాదు. ఏ రకమైన వ్యాయామం బుద్ధిపూర్వకంగా చేస్తే ఒత్తిడిని తగ్గించగలదు.
యోగాభ్యాసంలో శ్వాసను బ్యాలెన్సింగ్ చేయడానికి ఆసనాలు మెదడు యొక్క రెండు వైపులా సమతుల్యం చేస్తాయి. నొప్పిని తగ్గిస్తుంది. యోగా చేయడం వల్ల బలపడటమే కాకుండా వెన్నునొప్పి, నడుము నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
యోగా మైగ్రేన్, తలనొప్పి యొక్క విపరీతమైన రూపం, ఏదైనా ఆత్మను బలహీనపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ భయంకరమైన తలనొప్పితో పాటు మైగ్రేన్‌లను తగ్గించడంలో కొన్ని యోగా ఆసనాలు సహాయపడతాయి.
అధోముఖ శ్వనాసనం, ప్రసారిత పదోత్తనాసనం, ఉత్తానాసనం, జానుశీర్షాసనం, పశ్చిమోత్తాసనం, మత్సేంద్రాసనం, ఊర్ధ్వముఖ శ్వనాసనం, సేతుబంధ, మాతు శ్వాసనాళం వంటివి తలనొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ భంగిమల్లో మెదడుకు ప్రవహించే రక్తం పరిమాణం పెరగడం వల్ల సహజంగానే తలనొప్పి తగ్గుతుంది.
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి యోగా ఒక గొప్ప మార్గం. యోగా చేయడం వల్ల మీ మనస్సు, శరీరం రెండింటినీ ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. రోజువారీ యోగా ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతర్గత రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల ఓ వ్యక్తి తండ్రి లాంటి రక్షణ, తల్లి లాంటి క్షమాపణ, స్నేహితుడి లాంటి మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. క్రమం తప్పకుండా యోగాభ్యాసం చేయడం ద్వారా సత్యం మనకు వారసుడిగా మారుతుంది. జ్ఞానం మనలోని ఆకలిని చల్లార్చుతుంది.
2 - 0
మీ రామాయణం పరిజ్ఞానం పరీక్షించుకోండి.. తెలియని విషయాలను తెలుసుకోండి..
శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?
వాల్మీకి.
శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?
24,000.
వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?
నారదుడు.
రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?
తమసా నది.
శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?
కుశలవులు.
అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?
సరయూ నది.
అయోధ్య ఏ దేశానికి రాజధాని?
కోసల రాజ్యం.
దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?
సుమంత్రుడు.
దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?
కౌసల్య, సుమిత్ర, కైకేయి.
సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?
పుత్రకామేష్ఠి.
యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను?
కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.
కౌసల్య కుమారుని పేరేమిటి?
శ్రీరాముడు.
భరతుని తల్లి పేరేమిటి?
కైకేయి.
రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు? వారి తల్లి పేరేమిటి?
లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర.
బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వారెవ్వరు?
జాంబవంతుడు.
వాలి ఎవరి అంశతో జన్మించెను?
దేవేంద్రుడు.
వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?
హనుమంతుడు.
రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు?
వసిష్ఠుడు.
విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?
16 సంవత్సరములు.
విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?
మారీచ, సుబాహులు.
రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి?
బల-అతిబల.
విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?
సిద్ధాశ్రమం.
తాటక భర్త పేరేమిటి?
సుందుడు.
తాటకను శపించిన మహర్షి ఎవరు?
అగస్త్యుడు.
గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు?
భగీరథుడు.
గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను?
జహ్ను మహర్షి చేత త్రాగి..కర్ణంతో విడువబడుతో జాహ్నవి పేరు
అహల్య భర్త ఎవరు?
గౌతమ మహర్షి.
జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?
శతానందుడు.
సీత జనకుడికి ఎట్లు దొరికెను
పొలం దున్నుతుంటే నాగలి చాలున జనకునికి దొరికెను.
శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను?
దేవరాతుడు.
శివధనుస్సును తయారు చేసినదెవరు?
విశ్వకర్మ.
భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?
మాండవి, శృతకీర్తి.
లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?
జనకుడు.
జనకుడి తమ్ముడి పేరు ఏమిటి?
కుశధ్వజుడు.
పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి?
వైష్ణవ ధనుస్సు.
భరతుని మేనమామ పేరు ఏమిటి?
యుధాజిత్తు.
దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?
మంధర.
కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను?
గిరివ్రజపురం, మేనమామ యింట.
రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?
శృంగిబేరపురం.
సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను?
గారచెట్టు.
శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?
భరద్వాజ ముని.
పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?
మాల్యవతీ.
దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎట్లు భద్రపరిచారు?
తైలద్రోణములో.
శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?
జాబాలి.
భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?
నందిగ్రామము.
అత్రిమహాముని భార్య ఎవరు?
అనసూయ.
దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?
విరాధుడు.
పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు?
అగస్త్యుడు.
పంచవటి ఏ నదీతీరమున ఉన్నది?
గోదావరి.
లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను?
శూర్ఫణఖ.
ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను?
జనస్థానము.
సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను?
మారీచుడు.
సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?
బంగారులేడి.
సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు?
జటాయువు.
సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను?
దక్షిణపు దిక్కు.
సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను?
కబంధుని.
సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?
మతంగ వనం, పంపానదీ.
సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను?
ఋష్యమూక పర్వతం.
రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను?
హనుమంతుడు.
రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?
అగ్ని సాక్షిగా.
రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను?
కుమారస్వామి జన్మించిన వనములోని బంగారు కాండములు.
సుగ్రీవుని భార్య పేరు?
రుమ.
వాలి భార్యపేరు?
తార.
వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?
కిష్కింధ.
వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి?
మాయావి.
హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు?
దుందుభి.
వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను?
మతంగముని.
వాలి కుమారుని పేరేమిటి?
అంగదుడు.
రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను?
ఏడు.
సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను?
ప్రసవణగిరి.
సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు “తూర్పు” దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
వినతుడు.
సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు “దక్షిణ” దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
అంగదుడు.
సుగ్రీవునికి, సీతాన్వేషణ కోసం “పశ్చిమ” దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి?
మామగారు, తార తండ్రి.
సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు “ఉత్తర” దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
శతబలుడు.
సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను?
మాసం (ఒక నెల).
హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను?
దక్షిణ దిక్కు.
సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను?
రామ పేరు చెక్కబడిన ఉంగరము.
హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి?
స్వయంప్రభ.
సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి?
సంపాతి.
హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు?
పుంజికస్థల.
హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి?
మహేంద్రపర్వతము.
హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?
మైనాకుడు.
హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి?
సురస.
హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి?
సింహిక.
హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?
నూరు యోజనములు.
లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి?
లంబ పర్వతం.
హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?
అశోక వనం.
రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను?
పన్నెండు
రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?
త్రిజట.
హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను?
రామ కథ.
రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి?
చూడామణి.
హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను?
నభై వేలమంది.
హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను?
ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం.
దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?
విభీషణుడు.
తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి?
మధువనం.
వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు?
మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు.
సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి?
ఆలింగన సౌభాగ్యం.
సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి?
నలుడు
ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను?
నికుంభిల.
రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు?
అగస్త్యుడు.
రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు?
ఇంద్రుడు.
రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?
మాతలి.
రావణ వధానంతరం లంకనుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరి కోసం ఆగుతుంది?
కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!
గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను?
హనుమంతుడు.
అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి?
శత్రుంజయం.
శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను?
స్వయంగా తన భవనమునే యిచ్చెను.
పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది?
బ్రహ్మ.
శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన బహుమతి ఏమిటి?
తన మెడలోని ముత్యాలహారం.
4 - 0
Hello friends...
Welcome to Telugu world Media youtube channel.
Watch my videos....
Like,Share and Subscribe.
Thank you