సువార్త ఉచితం
దేవుని వాక్యం ఉచితం
దేవుని రక్షణ ఉచితం
అయితే మనం దేవుని వాక్యం ఎలా ప్రకటిస్తున్నామో మనకు మనమే ప్రశ్న వేసుకొవాలి,
విశ్లేషణ చేసుకోవాలి.
కొంతమంది బ్రదర్ మీకు అసలు వాక్యం తెలుసా
పనివాడు జీతాన్నికి పాత్రుడు అని వాక్యం చెబుతుంది
అని అంటారు.
జీతం అంటే పనికి లభించే ప్రతిఫలం.
పని చెయ్యండి ప్రతి ఫలం ఆశిచకండి.
అస్సలు ఆయన పని చేసే అవకాశం
రావడమే ఒక భాగ్యం అనుకొని
ఆ భాగ్యమే తనకు జీతమని ఎంచుకున్న
పౌలు తన మాటల్లో ఇలా అన్నారు
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 9:18
18.అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించునప్పుడు సువార్తయందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగ పరచుకొనకుండ సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము.
జీతం (డబ్బు) కావాలా భాగ్యం (పరలోకం) కావాలా?
మీ సహోదరుడు 🙏