Channel Avatar

TTD Latest Updates @UCamO-FbIY6iQTrPTtekx9Hw@youtube.com

26K subscribers - no pronouns :c

Hello Friends, This is Our Channel TTD Latest Updates, *Welc


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

TTD Latest Updates
Posted 56 minutes ago

🙏 Om Namo Venkatesaya 🙏

19-02-2025

Total pilgrims - 72,745

Tonsures: 24,156

Hundi kanukalu : 3.48 Cr

Waiting Compartments… 12

Approx. Darsan Time for Sarvadarshanam (with out SSD Tokens).... 14H

(SSD)Time slot Sarvadarshan... 3 to 5H

Rs 300 Special Darshan Approx. Time... 2 to 3H

Tq.

------------
శ్రీవారి భక్తులకు గమనిక :-
సర్వదర్శనానికి 08 గంటల సమయం పడుతుంది అంటే అది SSDటోకెన్లు లేకుండా ఆల్రెడీ q లైన్లోకి వెళ్లి కంపార్ట్ మెంట్ లో వెయిట్ చేస్తున్న వారికి 08 గంటలు అని.

ప్రస్తుతం కొత్తగా q లైన్లో కి వెళ్లేవారికి 10 నుంచి 14 గంటల పైన సమయం పట్టే అవకాశం వుంది సమయం - భక్తుల రద్దీ ని బట్టి సమయాలు మారుతాయి గమనించగలరు.

----
తిరుమల తాజా సమాచారం కోసం మన వాట్సప్, తెలిగ్రామ్ & యూట్యూబ్ ఛానెల్స్ లో జాయిన్ కాగలరు🙏:-

whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

t.me/LaxmiTeluguTech

youtube.com/@TtdLatestUpdates

👉 New Channel ( ఇ News తెలుగు ) :-youtube.com/@enewstelugu?sub_confirmation=1

25 - 0

TTD Latest Updates
Posted 1 hour ago

శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల్లోఆకట్టుకున్న సంగీత, నృత్య కార్యక్రమాలు

తిరుపతి, 2025 ఫిబ్రవరి 19: శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తొలిరోజైన బుధ‌వారం రాత్రి శ్రీ వెంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల మరియు శ్రీ వెంకటేశ్వర నాదస్వర, డోలు పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత, నృత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై నాదస్వర, డోలు కచేరి అలరించింది. ఇందులో శ్రీ మునిరత్నం, శ్రీ కృష్ణమూర్తి బృందం నాదస్వరం, శ్రీ కృష్ణారావు, శ్రీ కృష్ణమూర్తి బృందం నాదస్వరం కచేరి చేశారు. అదేవిధంగా కళాశాల అధ్యాపకురాలు డా. వందన బృందం గాత్ర కచేరి వీనులవిందుగా సాగింది. అనంత‌రం క‌ళాశాల అధ్యాప‌కులు శ్రీ ర‌వికుమార్ బృందం “కూచిపుడి” ప్రదర్శన వీక్షకులను అలరించింది.

టీటీడీ ముఖ్య‌ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

2 - 0

TTD Latest Updates
Posted 1 hour ago

హంస వాహనంపై స‌ర‌స్వ‌తీ అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు

తిరుపతి, 2025 ఫిబ్రవరి 19: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధ‌వారం రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో హంస‌ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

వాహనం ముందు వృషభాలు, అశ్వాలు, గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

హంస వాహనం – బ్రహ్మ పద ప్రాప్తి

హంస వాహనసేవలో శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్ర‌హ్మ‌ప‌ద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.

వాహ‌న‌సేవ‌లో ఆలయ ప్ర‌త్యేకాధికారి మ‌రియు సిపిఆర్వో డా.టి.ర‌వి, ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, ఏఈవో శ్రీ గోపినాథ్‌, సూపరింటెండెంట్ శ్రీ ర‌మేష్‌, ఆలయ అర్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్‌, శ్రీ ధ‌న శేఖ‌ర్‌, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

2 - 0

TTD Latest Updates
Posted 1 hour ago

హంస వాహనంపై శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి అభ‌యం

తిరుపతి, 2025 ఫిబ్రవరి 19: తిరుప‌తి శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల్లో మొద‌టి రోజైన బుధ‌వారం రాత్రి 7 నుండి హంస వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు తిరుపతి పురవీధుల్లో భ‌క్తుల‌కు అభ‌య‌మిచ్చారు. గ‌జ‌రాజులు ముందు న‌డుస్తుండ‌గా క‌ళాబృందాల కోలాటాలు, భ‌జ‌నల న‌డుమ వాహ‌న‌సేవ కోలాహ‌లంగా జ‌రిగింది. భ‌క్తులు అడుగ‌డుగునా క‌ర్పూర‌హార‌తులు స‌మ‌ర్పించారు.

ఆది దంపతులైన స్వామి, అమ్మవార్లు హంస మిథునం(దంపతులు)లా గోచరిస్తారు. వారి వల్లనే అష్టాదశ విద్యలు పరిణమించాయి. పాలను, నీటిని వేరు చేసే వివేకం అలవడింది. కపిలాది యోగీశ్వరుల మానస సరస్సులో హంస జంటగా స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఏఈవో శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్‌ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది

0 - 0

TTD Latest Updates
Posted 1 hour ago

సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి క‌టాక్షం

చెన్నై / తిరుపతి, 2025 ఫిబ్రవరి 19: తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధ‌వారం రాత్రి 7 గంట‌లకు అమ్మ‌వారు యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో సింహ‌ వాహనంపై భక్తులను క‌టాక్షించారు. శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 16 నుండి ఫిబ్రవరి 26 వరకు వైభవంగా జ‌రుగుతున్నాయి.

ఇందులో భాగంగా ఫిబ్ర‌వ‌రి 20వ తేదీన ఉదయం కల్పవృక్ష వాహనంపై, రాత్రి హనుమంత వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ పార్థ‌సార‌ధి, సూపరింటెండెంట్ శ్రీమ‌తి పుష్ప‌ల‌త‌, ఆల‌య అర్చ‌కులు ఇత‌ర అదికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది

0 - 0

TTD Latest Updates
Posted 1 hour ago

ధ్వజారోహణంతో వేడుకగా శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2025 ఫిబ్రవరి 19: తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు బుధ‌వారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.

అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివనామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన శ్రీ సోమస్కంధమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ వినాయక స్వామి, శ్రీ చండికేశ్వరస్వామి, శ్రీ వల్లి, దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామివారి ఉత్సవమూర్తుల సమక్షంలో ఉదయం 5.20 గంటలకు మ‌క‌ర‌ లగ్నంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి అధిరోహింపచేశారు.

ఏడాదికోసారి ధ్వజస్తంభానికి విశేష అభిషేకం…

ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణ, ఆ తరువాత ధ్వజస్తంభానికి అభిషేకం, బలి, నివేదన, దీపారాధన, ఉపచారాలు నిర్వహించారు. ఏడాదికోసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం రోజున మాత్రమే ధ్వజస్తంభానికి విశేషంగా అభిషేకం చేస్తారు. పెరుగు, చందనం, విభూది, పన్నీరు, పలురకాల పండ్లరసాలతో వేడుకగా ధ్వజస్తంభానికి అభిషేకం జరిగింది. దీపారాధనలో భాగంగా రథహారతి, నక్షత్రహారతి, సద్యజాతాది దీపారాధన, కుంభహారతి నిర్వహించారు. ఆ తరువాత ఛత్రం, చామరాలు, అద్దం, సూర్యచంద్రులు, విసనకర్ర, ధ్వజంతో ఉపచారాలు చేశారు. అదేవిధంగా రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాల్లోని మంత్రాలను పఠించారు. కంకణభట్టర్ శ్రీ స్వామినాథ గురుకుల్ ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు శ్రీ మణివాసన్ గురుకుల్ మీడియాతో మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10 రోజులపాటు ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయని తెలిపారు. ఫిబ్ర‌వ‌రి 26న శివరాత్రి పర్వదినం విశేషంగా జరుగనుందని చెప్పారు. ఫిబ్ర‌వ‌రి 27న కల్యాణోత్సవం, ఫిబ్ర‌వ‌రి 28న త్రిశూల స్నానం, ధ్వజావరోహణం జరుగనున్నాయని, భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

అనంతరం శ్రీ సోమస్కందమూర్తి (శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్యస్వామి), శ్రీ కామాక్షి అమ్మవారికి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. పల్లకీపై స్వామి, అమ్మవారు తిరుపతి పురవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఏఈవో శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్‌ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, అర్చకులు శ్రీ ఉదయ గురుకుల్, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది

0 - 0

TTD Latest Updates
Posted 1 hour ago

చిన్నశేషవాహనంపై శ్రీ వేణు గోపాల కృష్ణుడి అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు

తిరుపతి, 2025 ఫిబ్రవరి 19: శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధ‌వారం ఉదయం 8 గంటలకు శ్రీనివాసుడు శ్రీ వేణు గోపాల కృష్ణుడి అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు.

భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

రెండో రోజు ఉదయం శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు ఒక్కరే ఐదు తలలు గల చిన్నశేష వాహనాన్ని అధిష్టించారు. చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కన్పించే శ్రీవారి ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించేశక్తి. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరిస్తాడు.

రాత్రి 7 నుండి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, ఏఈవో శ్రీ గోపినాథ్‌, సూపరింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్‌, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాలాజి రంగాచార్యులు,టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ మునికుమార్‌, శ్రీ ధ‌న శేఖ‌ర్‌, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది

«Total pilgrims who had darshan on 18.02.2025: 68,427»KAPILESWARA A

1 - 0

TTD Latest Updates
Posted 1 hour ago

ఫిబ్ర‌వ‌రి 23న తిరుమలలో అనంతాళ్వారు 971వ అవతారోత్సవం

తిరుమల, 2025 ఫిబ్రవరి 19: శ్రీవైష్ణవ భక్తుడు, ఆళ్వారులలో ప్రముఖుడైన శ్రీ అనంతాళ్వారు 971వ అవతారోత్సవాన్ని ఫిబ్ర‌వ‌రి 23వ తేదీన తిరుమలలోని శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో టీటీడీ ఘనంగా నిర్వహించనుంది.

ఈ సందర్భంగా ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అనంతాళ్వార్‌ బోధనలు, రచనలపై సదస్సు నిర్వహిస్తారు. ఉద‌యం 9.30 గంట‌ల‌కు ఈ కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది.

సాధారణంగా అనంతళ్వారు జననం చైత్రమాసంలో తమిళనాడులో సంభవించినా తిరుమలలో ఆయన కాలుమోపిన దినాన్ని అవతారోత్సవంగా వారి వంశీకులు పరిగణిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా దేశవ్యాప్తంగా స్థిరపడిన‌ అనంతాళ్వారు వంశీయులు తిరుమలలోని పురశైవారి తోటలో (అనంతాళ్వారు తోట) కలసి ప్రత్యేక పూజలు, దివ్యప్రబంధ పాశుర పారాయణం, ఆధ్యాత్మిక ప్రవచన‌ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

పురాణాల ప్ర‌కారం శ్రీ అనంతాళ్వారు సాక్షాత్తు ఆదిశేషుని రూపంగా మరో శ్రీవైష్ణవ భక్తాగ్రేశ్వరుడు శ్రీరామానుజాచార్యులతో కలిసి అవిర్భవించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రామానుజాచార్యుని అభిమతానుసారమే శిష్యుడైన అనంతాళ్వారు తిరుమలకు వేంచేసి స్వామివారి పుష్ప కైంకర్యానికి శ్రీకారం చుట్టినట్లు పురాణ‌ కథనాలు ఉన్నాయి.

అందులో భాగంగానే ఒకనాడు అనంతాళ్వారు నిండు గర్భిణియైన తన భార్యతో కలిసి స్వామివారి ఆలయం చెంత ఒక పూలతోటను ఏర్పాటు చేస్తుండగా బాలుని రూపంలో సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి ప్రత్యక్షమయ్యాడు. తాను కాదన్నా తన భార్యకు పనులలో చేదోడువాదోడుగా ఉద్యానవన నిర్మాణంలో సహకరించాడన్న కోపంతో అనంతాళ్వారు ఆ బాలునిపై తన చేతిలో ఉన్న గునపాన్ని విసిరాడు. మరునాడు స్వామివారి మూలవిరాట్టు చుబుకం నుండి రక్తస్రావం చూసి తాను చేసిన పొరపాటుకు పశ్చాత్తాపం చెందాడు. వెంటనే స్వామివారి గాయానికి కర్పూరపు ముద్దను అంటించి తన అపారభక్తిని చాటుకున్నాడు. తద్వారా శ్రీవేంకటేశ్వరస్వామివారి కృపకు పాత్రుడయ్యాడు.

నేటికీ స్వామివారి చుబుకానికి కర్పూరాన్ని అంటించడం అనంతాళ్వారు దివ్యగాథను స్ఫురింపచేస్తుంది. అదే విధంగా నేటికీ మహాద్వారం చెంత అనంతాళ్వారు స్వామివారిపై విసిరిన గునపం కూడా భక్తులకు దర్శనమిస్తోంది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

2 - 0

TTD Latest Updates
Posted 1 day ago

శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

– ఫిబ్రవరి 19న ధ్వజారోహణం

తిరుపతి, 2025 ఫిబ్రవరి 18: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఫిబ్ర‌వ‌రి 19 నుండి 28వ తేదీ వరకు ఆల‌యంలో బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి.

అంకురార్ప‌ణం సందర్భంగా సాయంత్రం మూషిక వాహనంపై శ్రీ వినాయకస్వామివారు పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఆ త‌రువాత శాస్త్రోక్తంగా అంకురార్పణం జ‌రిగింది.

ఫిబ్ర‌వ‌రి 19న ధ్వజారోహణం :

ఫిబ్ర‌వ‌రి 19న ఉదయం 5.20 గంటలకు మ‌క‌ర‌ లగ్నంలో ధ్వజారోహణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయి. అనంతరం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు పల్లకీ ఉత్సవం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహన సేవ జరుగనున్నాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

బ్ర‌హ్మోత్స‌వాల‌లో ప్రతి రోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ

19-02-2025

ఉద‌యం – ధ్వజారోహణం

రాత్రి – హంస వాహనం

20-02-2025

ఉద‌యం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

21-02-2025

ఉద‌యం – భూత వాహనం

రాత్రి – సింహ వాహనం

22-02-2025

ఉద‌యం – మకర వాహనం

రాత్రి – శేష వాహనం

23-02-2025

ఉద‌యం – తిరుచ్చి ఉత్సవం

రాత్రి – అధికారనంది వాహనం

24-02-2025

ఉద‌యం – వ్యాఘ్ర వాహనం

రాత్రి – గజ వాహనం

25-02-2025

ఉద‌యం – కల్పవృక్ష వాహనం

రాత్రి – అశ్వ వాహనం

26-02-2025

ఉద‌యం – రథోత్సవం (భోగితేరు)

రాత్రి – నందివాహనం

27-02-2025

ఉద‌యం – పురుషామృగవాహనం

సాయంత్రం – కల్యాణోత్సవం,

రాత్రి – తిరుచ్చి ఉత్సవం

28-02-2025

ఉద‌యం – త్రిశూలస్నానం

సాయంత్రం – ధ్వజావరోహణం,

రాత్రి – రావణాసుర వాహనం

ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది

48 - 0