No content on this channel :c try Try Looking at shorts maybe lol :p
రెండవ తిమోతికి 4:2,3,4
2.వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధిచెప్పుము.
3.ఎందుకనగా జనులు హితబోధను(ఆరోగ్యకరమైన భోదన) సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని,
4.సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపునకు తిరుగుకాలము వచ్చును.
మొదటి తిమోతికి 6:3,4,5
3.ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను(ఆరోగ్యకరమైన వాక్యములను) దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక, భిన్నమైన బోధనుపదేశించినయెడల
4.వాడేమియు ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ కలహము దూషణలు దురనుమానములును,
5.చెడిపోయిన మనస్సుకలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుష్యుల వ్యర్థవివాదములును కలుగుచున్నవి.
నేటి క్రైస్తవులలో (సేవకులైనను - విశ్వాసులైనను) కొందరు Sound Doctrine లేదా Sound Teaching తోసిపుచ్చుతూ - వారికీ అనుకూలమైన బోధను ఇష్టపడుతున్నారు.
ఈ చానెల్ నందు Sound Doctrine లేదా Sound Teaching బోధించబడును.