Channel Avatar

Babu Tenneti @UCTpP280rBFmvnrAtbikpunQ@youtube.com

1.4K subscribers - no pronouns :c

Hi friends I am from konaseema. I newly started YouTube chan


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Babu Tenneti
Posted 1 week ago

పుష్ప 2 :

ఒక కూలీగా జీవితాన్ని మొదలుపెట్టి శక్తివంతమైన స్మగ్లర్ గా ఎదిగిన యువకుడి కధతో గతంలో పుష్ప మొదటి పార్ట్ వస్తే , స్మగ్లింగ్ సామ్రాజ్యానికి తిరుగులేని శక్తిగా ఎదిగిన పుష్ప తన ఆధిపత్యాన్ని ఎలా నిలుపుకున్నాడు , రెండోభార్యకి పుట్టినందుకు ఇంటిపేరు కూడా లేకుండా ఎన్నో అవమానాలకు గురైన పుష్ప తిరిగి తన ఇంటిపేరుని ఎలా తెచ్చుకున్నాడు అనే కధతో ఇప్పుడు పుష్ప 2 రిలీజైంది. నిన్న రాత్రి స్పెషల్ షో చూసాను. సినిమా చాలా బావుంది.

తన బాడీలాంగ్వేజ్, మేనరిజం , డైలాగ్స్ తో అల్లు అర్జున్ మరొకసారి పుష్ప పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నాడు. డైలాగ్స్ కూడా బావున్నాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ తరువాత నుండి ఎండ్ కార్డ్ పడే వరకూ ప్రతీ సీన్ ప్రేక్షకుడ్ని ఊపిరి బిగబట్టి చూసేలా చేస్తుంది. సినిమా ఎక్కడా బోర్ కొట్టదు.

జాతరలో ఆడవేషంతో నటించిన పాట, చెప్పిన డైలాగ్స్ , చేసిన ఫైట్ లతో పాటు సెకండాఫ్ లో వచ్చే కామెడీ, సెంటిమెంట్ , ఫైట్ ఇలా ప్రతీ సీన్లో చాలా అద్భుతంగా నటించి అల్లు అర్జున్ తన కెరీర్ మొత్తంలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడనిపించింది.

పుష్ప కేరెక్టర్ ని సుకుమార్ చాలా చక్కగా రాసుకోవడమే కాదు చాలా అద్భుతంగా ప్రెజెంట్ చేసాడు. హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సీన్లు ఎక్కువగా ఉండడంతో ప్రేక్షకులు తమకి తెలీకుండానే పుష్ప కేరెక్టర్ ని ఓన్ చేసేసుకుంటారు. పోలీసులకి, ప్రత్యర్ధులకి దొరకకుండా ఎత్తుకి పైఎత్తులు వేస్తూ పుష్ప గెలిచే ఒక్కో సీన్ వావ్ అనిపిస్తుంది. విలన్స్ అన్నకూతుర్ని కిడ్నాప్ చేసినపుడు పుష్ప సృష్టించిన విధ్వంసాన్ని ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు. ఇది పూర్తిగా అల్లు అర్జున్ ఒన్ మేన్ షో లా అనిపుస్తుంది. ఈ స్ధాయి నటనని అతని నుండి ఊహించలేదు. ఎమోషన్స్ ని కూడా చాలా బాగా పండించగలిగాడు. పుష్ప మొదటి పార్ట్ తో పోలిస్తే ఈ రెండోపార్ట్ ఇంకా బెటర్ గా అనిపించింది.

సినిమాలో కంటెంట్ బావుంటే జనాలు ట్రోల్స్ నే కాదు టిక్కెట్ రేట్లను కూడా పట్టించుకోరు. ఎవరేమనుకున్నా ఈ సినిమాతో అల్లు అర్జున్ మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. కొన్ని కొన్ని సీన్లలో సెటైర్లు కూడా వేసాడు. రష్మిక, అజయ్, ఫహద్ ఫాజిల్, జగదీష్, రావురమేష్ , జగపతిబాబు లకి మంచి కేరెక్టర్స్ లభించాయి. క్లైమాక్స్ కి వచ్చేసరికి సినిమాలో ఉన్న విలన్స్ అంతా ఒక బ్యాచ్ గా ఫార్మ్ పుష్పని చంపడానికి స్కెచ్ వేస్తారు. ఆ స్కెచ్ వేసి వీరిని వెనక ఉండి నడిపిస్తున్న ఒక అజ్నాతవ్యక్తి ఎవరనేది చూపించకుండా పుష్ప పార్ట్ 3 కి లీడ్ ఇచ్చారు.

యాక్షన్ సీన్లు ఎక్కువగానే ఉన్నాయి. ఒకటి రెండు రొమాంటిక్ సీన్లు కూడా ఉన్నాయి. సినిమా ఎంత సీరియస్ గా నడుస్తున్నా రష్మిక స్క్రీన్ మీద కనిపించినపుడల్లా మళ్ళీగాని ఫీలింగ్స్ వచ్చి పుష్పని లాక్కెళిపోతుందేమో అనే డౌట్ మనసులోకి వచ్చేస్తుంది. పుష్పరాజైనా మహరాజైనా ఒకో మగాడి జీవితం అంతే. తరువాత రష్మికతో కొన్ని మంచి డైలాగ్స్ చెప్పించి మంచిగా ఆ కేరెక్టర్ ని కవర్ చేసారు

ఓవరాల్ గా సినిమా బావుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కి, పిల్లలకి నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ....పార్ధు వేణుగోపాలరాజు.

3 - 0

Babu Tenneti
Posted 1 month ago

4 - 0

Babu Tenneti
Posted 2 months ago

Aquaculture expo 2024

3 - 0

Babu Tenneti
Posted 2 months ago

3 - 0

Babu Tenneti
Posted 4 months ago

Happy independence day to all

5 - 0

Babu Tenneti
Posted 11 months ago

బ్రతకాలి అనే కోరిక.... తిరిగి ఫలాలు ఇస్తుందేమో 😍

5 - 0

Babu Tenneti
Posted 1 year ago

For sale

3 - 0

Babu Tenneti
Posted 1 year ago

రొయ్యలు తినండి

5 - 1