in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
నేడు శని త్రయోదశి.స్వామివారి కరుణ కోసం ఒక్కసారి..
శనీశ్వర స్వామి ని స్మరిద్దాం.🙏🏵️🙏
క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్
ఛాయామార్తాండ సంభూతం
నమస్యామి శనైశ్చరమ్
నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ
నీహారవర్ణాంజనమేచకాయ శ్రుత్వా
రహస్యం భవకామదశ్చ
ఫలప్రదో మే భవ సూర్యపుత్రం
నమోస్తు ప్రేతరాజాయ
కృష్ణదేహాయ వై నమః
శనైశ్చరాయ కౄరాయ
శుద్ధబుద్ధి ప్రదాయనే
య ఏభిర్నామభి: స్తౌతి
తస్య తుష్టా భవామ్యహమ్
మదీయం తు భయం
తస్య స్వప్నేపి న భవిష్యతి
" సూర్యపుత్రాయ శనీశ్వరాయ నమో నమః "
.
#Shanidev #saturdayvibes
5 - 0
🌸
భాద్రపద శుక్ల పంచమి
ఋషి పంచమి
▫
లోక పూజ్యులు , సమాజ సృష్టికర్తలైన
అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమ,
వశిష్ట, జమదగ్ని,విశ్వామిత్ర మహర్షులను
ఈ భాద్రపద శుద్ధ పంచమి రోజున
ప్రతీ ఒక్కరూ స్మరించుకోవాలి.
కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్రోథ గౌతమః!
వశిష్టో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయః స్మృతాః!!
( 1 )
కశ్యప మహర్షి:
సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి.
మరీచి, కళ దేవీల పుత్రుడు.
దక్షప్రజాపతి పుత్రికల్లో 13 మందిని,
వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు.
వారి ద్వారానే దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు,
మానేయులు, యక్షులు, , వృక్ష లతా త్పణ జాతులు,
రాక్షసులు , సింహ, మృగ, సర్పాలను, పక్షులను,
గోగణాలను, అనూరుడు, గరుడుడు, నాగులు,
కాలకేయులను, పౌలోములను,
పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే
బ్రహ్మర్షిని పుత్రులుగా పొందారు .
( 2 )
అత్రి మహర్షి :
సప్తర్షుల్లో రెండోవాడైన అత్రి మహర్షి
బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు.
అతని భార్య అనసూయ దేవి .
అత్రి తన తపోబలంతో
త్రిమూర్తులను పోలిన సోమ, దూర్వాస,
దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు.
అత్రి భార్య అనసూయదేవి .
మహా పతివ్రతా శిరోమణి.
బ్రహ్మ , విష్ణు , పరమేశ్వరుల సంతానమే
దత్తాత్రేయ స్వామివారు.
( 3 )
భరద్వాజ మహర్షి :
భరద్వాజుడు ఉతథ్యుని పుత్రుడు.
తల్లి పేరు మమతా దేవి .
బృహస్పతి కృప వలన జన్మించి,
ఘృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది,
ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు.
శ్రీ మహావిష్ణువునకు త్రేతాయుగంలో
శ్రీరామునికి , సీతాదేవికి , లక్ష్మణ స్వామివార్లకు
తన ఆశ్రమంనందు ఆశ్రయమిచ్చి
చిత్రకూట పర్వతాలకు
దారి చూపించి సహాయం చేసిన ఋషి.
( 4 )
విశ్వామిత్ర మహర్షి :
విశ్వామిత్రుడు రాజర్షి.
త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని,
హరిశ్చంద్రునిచే అసత్యమాడించే ప్రయత్నం చేసి
మరి కొంత ఫలాన్ని కోల్పోయి ,
మేనక వల్ల తపోవిఘ్నం పొంది
శకుంతల జననానికి మూల పురుషుడయ్యాడు.
దుష్యంతుడు, శకుంతలల పుత్రుడే భరతుడు.
వీరి వల్లనే మన దేశానికి భరత ఖండమని ,
భారతదేశమని నామకరణానికి ఆదిగా నిలిచాడు.
( 5 )
గౌతమ మహర్షి :
ఈయనే ప్రప్రథమ వ్యవసాయ సృష్టికర్త.
తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు వేలాదిమంది ఋషులకు , మునుల కుటుంబాలకు
గౌతముడు తన ఆశ్రమం నందు
భోజన వసతి కల్పించిన
ప్రప్రథమ అన్నదాత .
ఇతని లోక క్షేమ సేవలను చూసి ,
ఇతర ఋషుల ఈర్ష్యను పెంచుకొని
ఓ మాయా గోవును సృష్టించి ,
అతని వ్యవసాయ క్షేత్రంలో వదలగా ,
ఆ మాయా గోవును దర్భతో అదిలించగా ,
మాయా గోవు మరణించడంతో బ్రహ్మహత్యా పాతకం
అంటగట్టుకొన్నాడు. ఆ దోష పరిహారం కొరకు
గోదావరి నదిని భూమిపైకి తెచ్చిన మహర్షి .
తన భార్యను శిలగా మారేటట్లు శాపమివ్వగా
శ్రీరాముని పాద స్పర్శతో శాప విమోచనం పొందిన
అహల్యా దేవి ఈయన ధర్మపత్నియే.
( 6 )
వశిష్ఠ మహర్షి :
ఇతని భార్య అరుంధతి దేవి.
నూతన వధూవరులకు వివాహం అనంతరం
ఆకాశన నక్షత్ర మండలంలో
చూపించేది ఈ అరుంధతీదేవినే.
వసిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు.
భృగు మహర్షికి తోబుట్టువు.
వైవస్వత మన్వంతరాన సప్తర్షుల్లో ఒకడు.
శక్తి మొదలైన వందమంది పుత్రులు గలవాడు.
దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు, గోత్రుడు,
ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు,శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు.
( 7 )
జమదగ్ని మహర్షి :
భృగు మహర్షికి ముని మనుమడు.
రుచిక ముని, సత్యవతుల కుమారుడు.
జమదగ్ని కుమారుడే శ్రీ మహావిష్ణువు అవతారమైన
పరశురాముడు. ఈయనే భార్గవ రాముడు.
జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన
అన్య పురుష వ్యామోహం వలన,
ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు.
ఆ తరవాత పరశురాముడి ప్రార్థన మేరకు
ఆమెను పునర్జీవితురాలిని చేశాడు .
క్షీర సాగర మధనంలో శ్రీ మహాలక్ష్మీతో పాటుగా జన్మించిన కామధేనువు జమదగ్ని మహర్షి ఆశ్రమంలోనే పోషింపబడింది.
▫️
సప్తర్షులు మహా తపః తేజస్సు గలవారు.
లోక కళ్యాణ కారకులు.
హైందవ ధర్మాలను , జీవన విధి విధానాలను ,
నాగరికతను సమాజానికి నేర్పించిన
లోక కళ్యాణ కారకులైన సప్త సద్గురువులు.
ఈ సప్తఋషులను భక్తితో స్మరిస్తూ ,
పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయని
శాస్త్రాలు చెబుతున్నాయి.
▫️
తులసిమొక్కను నాటండి .
భగవద్గీతను చదవండి.
5 - 0
శ్రావణ మాసం లో వచ్చే బహుళ అమావాస్యను ‘పోలాల అమావాస్య‘ అంటారు. ఈ పోలాల అమావాస్య వ్రతంకు ఎంతో విశిష్టత వుంది. సౌభాగ్యం కోసం, పిల్లల యోగ క్షేమాల కోసం, తమ కుటుంబంకోసం శ్రావణ అమావాస్యనాడు పోలాల అమావాస్య వ్రతం ఈ వ్రతమును ఆచరిస్తారు.ఇది ప్రాంతాచారం. గ్రుహాచారం ఉన్నవారు పూజించే వ్రతం.
పోలాల అమావాస్య పూజా విధానం:
పూజచేసే చోట శుభ్రంగా అలికి, వరిపిండితో ముగ్గువేసి, ఒక కందమొక్కను వుంచి, దానికి పసుపుకొమ్ము కట్టిన నాలుగుతోరాలను అక్కడ వుంచి, ముందుగా వినాయకుడికి పూజను చేయాలి. (కందమొక్క దొరకని పక్షంలో కందపిలక పెట్టి పూజ చేసుకొనవచ్చును.)
తర్వాత మంగళగౌరీదేవిని కానీ, సంతానలక్ష్మిని కానీ ఆ కందమొక్కలోకి ఆవాహనచేసి షోడశోపచార పూజను చేయవలెను. తొమ్మిది పూర్ణం బూర్లు మరియు తొమ్మిది గారెలు, తొమ్మిది రకముల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. తదుపరి కధను చదువుకొని కధా అక్షతలను శిరస్సున ధరించాలి. ఆ తర్వాత కందమొక్కకు ఒక తోరాన్ని కట్టి, మరొకటి తను మెడలో కట్టుకుని, మిగిలిన తోరాన్ని సంతానం మొలలో కట్టాలి(సంతానం ఇంకా లేనివారు అక్కడ ఉన్న పిల్ల కందమొక్కకు సమర్పించవచ్చును).అనంతరం ముత్తయిదువును పూజించి నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణంబూర్లు, ఒక తోరాన్ని, ఆమెకు వాయనంగా సమర్పించి దీవెనలు అందుకోవాలి.
సంతాన క్షేమం కోసం స్త్రీలు ఆచరించే ఈ పూజలో పూర్ణం బూర్లు, గారెలు, తొమ్మిది రకముల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నివేదిస్తారు.
ఆడపిల్లకావాలనుకునేవాళ్ళు( ఉన్నవాళ్ళు) గారెలు సమర్పించాలి.
మగపిల్లవాడు కావాలనుకునేవాళ్ళు బూరెలు (ఉన్నవాళ్ళు ) అమ్మవారికి సమర్పించాలి.
పోలాల అమావాస్య వ్రత కధ:
పూర్వం పిల్లలమఱ్ఱి అనే గ్రామంలో సంతానరామావధానులు అనే స్మార్తపండితుడు ఉండేవాడు. ఆయనకు ఏడుగురు మగపిల్లలు. అందరికీ పెళ్లిళ్ళయి, కోడళ్ళు కాపురానికి వచ్చారు. పెద్దకోడళ్ళు ఆరుగురికీ పిల్లలు పుట్టారు గానీ, చిన్నకోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం, వెంటనే చనిపోతూండడం జరిగేది. అలా ఆరుసార్లు జరిగింది. ఆ కారణంగా ఏ కోడలికీ ఆ ఆరు సంవత్సరాలూ ‘పోలాల అమావాస్య వ్రతం’ చేసుకోవడం కుదరలేదు. అందుచేత సుగుణంటే వారికి చాలా కోపం. సూటిపోటి మాటలతో బాధించేవారు. ఏడవ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది. ఈ సారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్దకొడళ్ళు నిర్ణయించుకున్నారు. సరిగ్గా శ్రావణ అమావాస్యనాడు సుగుణకు ప్రసవమై, మృతశిశువును కంది. ఈ సంగతి తోటికోడళ్ళకు తెలిప్తే తనను వ్రతానికి పిలవరని తలచి, చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి, ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డలమూట వుంచి తన తోటికోడళ్ళతో కలిసి ‘పోలాల అమావాస్య వ్రతాన్ని’ ఆచరించింది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుని ఎత్తుకుని కన్నీటితో స్మశానానికి వచ్చి, గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చుని, కన్నీరు మున్నీరుగా విలపించ సాగింది. అప్పటికి బాగా చీకటి పడింది.
ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలు దేరిన పోలాలమ్మదేవి, సుగుణ దగ్గరకు వచ్చి ‘ఎందుకు రోదిస్తున్నావు’ అని అడిగింది. సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది. పోలాలమ్మదేవి జాలిపడి, ‘ సుగుణా.., బాధపడకు. నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్లి, ఏ పేర్లయితే నీ పిల్లలకు పెట్టాలను కున్నావో ఆ పేర్లతో వారిని పిలు’ అని చెప్పి మాయమైపోయింది. సుగుణ వెంటనే ఆ సమాధుత దగ్గరకు వెళ్లి తన పుత్రులను పేరుపేరునా పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచివచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు. సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకుని, వారిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చి జరిగినదంతా తన తోటికోడళ్ళకు చెప్పింది. అందరూ సంతోషించారు. ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ, పిల్లా,పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి, తరించింది.
16 - 1
శ్రీ కృష్ణ జన్మాష్టమి :
శ్రావణ బహుళ అష్టమినాడు రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. అదే కృష్ణాష్టమి పర్వదినం. ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాలలోనూ నేడు కృష్ణభక్తులున్నారు. వారంతా అవతారమూర్తిగా, లీలామానుష విగ్రహునిగా శ్రీకృష్ణుడు ప్రదర్శించిన లీలలను పాడుకుని పరవశిస్తుంటారు. జన్మాష్టమి వేడుకలకు దేశవ్యాప్తంగా ప్రసిద్ధ శ్రీకృష్ణ క్షేత్రాలు భక్తులతో పోటెత్తుతాయి. రాసలీలా నృత్యాలతో, ఉట్లోత్సవాలతో, ప్రత్యేక పూజలతో జన్మాష్టమి వేడుకలు ప్రతి క్షేత్రంలోనూ గోకులాన్ని తలపిస్తాయి. మోక్షపురి ద్వారక మోక్షపురి ద్వారకలో ద్వారకాధీశునికి జన్మాష్టమికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పండుగనాడు తులసీ, చందన, వైజయంతిమాలలతో పీతాంబరాలతో నెమలిపింఛంతో, నెలవంకతో చతుర్భుజాలలో ఆయుధాలతో, వారణాశి నుంచి తెచ్చిన వేణువుతో ద్వారకాధీశుడు దర్శనమిస్తాడు. ఇస్కాన్ ఆలయాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చూడడానికి రెండు కళ్లూ చాలవు. దీనిని వారు మూడురోజుల ఉత్సవంగా నిర్వహిస్తారు. ప్రధానమైన జన్మాష్టమినాడు తెల్లవారు జామున రాధాకృష్ణ మూర్తులకు జరిపే తొలి అభిషేకంతో మొదలుపెట్టి, మధ్యరాత్రి వరకు తొమ్మిది సార్లు వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహిస్తారు. 56 నుంచి 108 వరకు వైవిధ్య భరితమైన నైవేద్యాలను రాధాకృష్ణులకు నైవేద్యంగా పెడతారు. హైదరాబాద్, బెంగళూరు, ద్వారక, మధుర, ఢిల్లీ, కలకత్తా, ముంబయి వంటి ప్రధాన నగరాలన్నింటిలోనూ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో టన్నుల కొద్దీ ప్రసాదాలను వితరణ చేస్తారు. రాత్రివేళలో ఆలయాల చుట్టూ దీపారాధనలు చేసి, భజనగీతాలు ఆలపిస్తారు.
.
#KrishnaJanmashtami #janmashtamispecial #krishnashtami2024 #jaisrikrishna🙏
13 - 0
వరలక్ష్మీ వ్రతం ఎందుకు చేసుకుంటారు ?
శ్రీ మహాలక్ష్మీ దేవి క్షీర సాగరము నుండి ఆవిర్భవించినది. చంద్రుడు కూడా శ్రీ మహాలక్ష్మీ దేవితో పాటు క్షీర సాగరము నుండి ఆవిర్భవించాడు. చంద్రుడు శ్రీ మహాలక్ష్మీ దేవికి సోదరుడు. పౌర్ణమి ముందు చంద్రుడు సంపూర్ణమైన కాంతితో పూర్ణ చంద్రుడిలా ప్రకాశిస్తుంటాడు. ఆ పూర్ణ చంద్రుని చూచి శ్రీ మహాలక్ష్మీ దేవి ఆ సమయమున ఎంతో సంతోషముగా ఉంటుంది . శ్రీ మహాలక్ష్మీ దేవి సంతోషముగా ఉండటానికి మరో ముఖ్య కారణం. శ్రావణ మాసం శ్రవణా నక్షత్రయుక్త మాసము. ఇది తన భర్త అయిన శ్రీ మహా విష్ణువు జన్మ నక్షత్రం. సాధారణంగా పౌర్ణమి శ్రవణా నక్షత్రం ఈ శ్రావణ మాసంలో ఇంచుమించుగా కలిసే వస్తాయి. అందువలన శ్రీ మహాలక్ష్మీ దేవి మరింత ప్రసన్నంగా ఉంటుంది. అలా శ్రీ మహాలక్ష్మీ దేవి సంతోషముగా ఉన్న పున్నమి ముందు శ్రావణ శుక్రవారం రోజున, ముత్తయిదువులు ఈ వరలక్ష్మీ దేవిని ఆరాధిస్తే, వారి సమస్త కోరికలు నేరవేరడమే కాకుండా, వారి సౌభాగ్యం నిండు నూరేళ్ళు సుఖ శాంతులతో వర్ధిల్లుతుందని మన పెద్దలు శ్రావణ పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతమును చేసుకోవాలని చెప్పారు. ఆ రోజున ముత్తయిదువులకు వీలుకాని పక్షంలో మాత్రమే మూడవ శ్రావణ శుక్రవారం కూడా నోచుకోనవచ్చు.
.
#varalakshmivratam2024 #fridayspecial
38 - 1
ఈ అనంత విశ్వాన్ని ’లక్షించేది’ లక్ష్మి. అందరూ లక్షించేది లక్ష్మిని. లక్షించడం అంటే చూడటమని అర్థం. అందరినీ తన కరుణామృతపూర్ణమైన చలువ చూపులతో ’కనిపెట్టుకుని’, గమనించి, పాలించే శక్తి - అని భావార్థం. కనులు తెరవడాన్ని సృష్తిగా, రెంటి నడుమ ఉన్నది స్థితిగా భావించవచ్చు. పరమేశ్వర శక్తిచే జరిగే సృష్టి స్థితి లయలే ’ఈక్షణ’ శక్తిగా వేదఋషులు అభివర్ణించారు.
సర్వసాక్షియైన ఈ భగవద్దర్శన శక్తిని లక్ష్మిగా ఉపాసించడం లక్ష్మీ ఆరాధనలోని ప్రత్యేకత. అందరూ ఆనందాన్నీ, ఐశ్వర్యాన్నీ, జ్ఞానాన్నీ, ’లక్ష్యం’గా పెట్టుకొనే జీవిస్తారు. ఇలా అందరికీ లక్ష్యమైన జ్ఞాన, ఆనంద, ఐశ్వర్యాల సాకార రూపమే ’లక్ష్మి’. ఈ దివ్యభావాన్ని సగుణంగా, లీలారూపంగా పురాణాలు వ్యక్తీకరించాయి. భృగు ప్రజాపతి, ఖ్యాతి దంపతులకు పరాశక్తి మహాలక్ష్మిగా ఆవిర్భవించింది. జ్యోతిషపరంగా దర్శిస్తే భృగు ప్రజాపతికి ప్రధానమైన రోజు శుక్రవారం. అందుకే దీనిని ’భృగు’వారమనీ వ్యవహరిస్తారు. భృగు పుత్రికగా లక్ష్మీదేవికి ’భార్గవి’ అని దివ్యనామం. పర్వతరాజు (హిమవాన్)పుత్రి పార్వతిలాగా భృగు పుత్రిక భార్గవి. ఈ లక్ష్మిని నారాయణుడికిచ్చి వివాహం చేశాడు భృగువు. నారాయణుడి సంకల్ప, దయాశక్తుల రూపం లక్ష్మి. విష్ణుదయనే ఆయాలోకాల్లో లక్ష్ములుగా, ఆరు ఐశ్వర్యాల రూపంగా వివిధ నామాలతో పేర్కొంటారు. స్వర్గలక్ష్మి, భూలక్ష్మి, గృహలక్ష్మి, వనలక్ష్మి...ఇలా విశిష్ట శోభ, సంపద కలిగిన చోట్లను లక్ష్మీ స్థానాలుగా చెబుతారు. శాస్త్రాలు ప్రస్తావించిన సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి - ఒకే లక్ష్మి తాలూకు విభిన్న రూపాలివి.
’వర’ శబ్దానికి ’కోరుకున్నది’ అని అర్థం. అందరూ కోరుకొనే సంపదలు వరాలు. వాటిని ఇచ్చేదీ, వాటి రూపంలో ఉన్నదీ వరలక్ష్మి. వారి వారి ప్రజ్ఞాస్థాయీ భేదాల రీత్యా ఒక్కొక్కరికీ ఒక్కొక్కటి వరం. కోరినవేవి కావలన్నా భగవత్సంకల్పం లేనిదీ, ఆయన దయ రానిదీ పొందలేం. అసలు ఆనందం, సంపదలేని వస్తువును మనం కోరుకోం. అలా మనం కోరుకునే వాటిలో ఆనందరూపంగా ఉన్నదీ, ఆనందాలను ప్రసాదించేదీ ఈ వరలక్ష్మి. వాస్తవానికి ఈ వరలక్ష్మిలో మిగిలిన అయిదు లక్ష్ములనూ సమన్వయించి చరమ నామంగా చెబుతారు. ’ప్రతి స్త్రీలోనూ లక్ష్మీ కళ ఉన్నది’ అని ఆర్ష వాక్యం. అందుకే స్త్రీలను లక్ష్మీ రూపాలుగా ఆరాధించడం, స్త్రీలు లక్ష్మీరూపాన్ని అర్చించడం - ఈ శ్రావణ వరలక్ష్మీ వ్రతం దివ్యత్వం.
15 - 0
అందరికీ నమస్కారం 🙏.. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మీకు ఉపయోగపడే ధర్మసందేహాలు అలాగే పరిహారాలు పూజలు నోములు వ్రతాలు పూజా పరిహారాలు పూజా విధానాల గురించి వివరించడం.. ఇంకా మంచి విషయాలను తెలుసుకుందాం.
Hello all 🙏.. this channel is dedicated to devotional aspects with peaceful soul. Please encourage us and subscribe our channel.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతపరమైన విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించి Adhyatmikanilayam 💐 ఛానల్ ఎటువంటి బాధ్యతల్ని తీసుకోదు. ఇంటర్నెట్లో సేకరించిన ఈ సమాచారాన్ని మీరు పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. మా ఛానల్ లో ఉండే విషయాలు కచ్చితంగా వాస్తవమే అని చెప్పేందుకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
Disclaimer: The information given in this channel is based on general assumptions. Adhyatmikanilayam doesn't confirm the same. Please contact relevant expert before implementing them.
For any information please contact via:
Gmail: adhyatmikanilayam@gmail.com
Note🙏:
💐Don't ask me for paid promotions 🙏