Channel Avatar

MUKKANTI EDITION @UCQC7vrA8vJx7gR2aD7wkRfQ@youtube.com

100K subscribers - no pronouns :c

MUKKANTI EDITION is one of the leading YouTube channels. Joi


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

MUKKANTI EDITION
Posted 1 day ago

భీష్ముడి అసలు పేరు ఏమిటి?

11 - 0

MUKKANTI EDITION
Posted 1 day ago

అర్జునుడి గురువు ఎవరు..?

6 - 0

MUKKANTI EDITION
Posted 1 day ago

ద్రోణాచార్యుడి కుమారుడు ఎవరు..?

4 - 0

MUKKANTI EDITION
Posted 1 day ago

మహాభారత గ్రంధానికి వ్యాసుడు ఇచ్చిన అసలు పేరేమిటి?

1 - 0

MUKKANTI EDITION
Posted 2 days ago

ఛైత్ర రధము అనే ఉద్యాన వనము ఎవరిది...?

6 - 0

MUKKANTI EDITION
Posted 5 days ago

A foreigner came to Kashi, visited Viswanath's temple and all the ghats.
Then he bought a VIBHUTHI packet from a boy selling on the street.
Foreigner then asked, "what is its expiry date?"
Boy replied, looking surprised: "It's made from expired people and when you apply on your forehead, it increases your expiry date." 👍😄

0 - 0

MUKKANTI EDITION
Posted 1 week ago

Meena Rashi February 2025 Monthly Horoscope |mukkanti edition
https://youtu.be/SlmDQFAykvg
Kumbha Rashi February 2025 Monthly Horoscope |mukkanti edition
https://youtu.be/lt6dNAQACO8
Makara Rashi February 2025 Monthly Horoscope |mukkanti edition
https://youtu.be/6SSYkUkBh-o
Dhanassu Rashi February 2025 Monthly Horoscope |mukkanti edition
https://youtu.be/ZTSspJ6OPN4
Vrushchika Rashi February 2025 Monthly Horoscope |mukkanti edition
https://youtu.be/0L3FFdJAoQA
Tula Rashi February 2025 Monthly Horoscope |mukkanti edition
https://youtu.be/UrnTyEiN1E8
Kanya Rashi February 2025 Monthly Horoscope |mukkanti edition
https://youtu.be/TpfOQ4a-nVI
Simha Rashi February 2025 Monthly Horoscope |mukkanti edition
https://youtu.be/mAtasfVhKq4
Karkataka Rashi February 2025 Monthly Horoscope |mukkanti edition
https://youtu.be/pKprZxu3ZiA
Mithuna Rashi February 2025 Monthly Horoscope |mukkanti edition
https://youtu.be/cSyu0W9qFjo
Vrushabha Rashi February 2025 Monthly Horoscope |mukkanti edition
https://youtu.be/UHAvb1CpXcU
Mesha Rashi February 2025 Monthly Horoscope |mukkanti edition
https://youtu.be/TIFeP5m4F04

0 - 0

MUKKANTI EDITION
Posted 2 weeks ago

#భగవద్గీత
॥ ఓమ్‌ నమో భగవతే శ్రీరామకృష్ణాయ ||
శ్రీమద్భగవద్గీత
చతుర్ధా_ధ్యాయః - జ్ఞాన, కర్మ, సన్న్యాస యోగము
శ్లోకం 13-14
చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః ।
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్ ।। 13 ।।
జనుల గుణములు, కార్యకలాపముల ఆధారంగా, నాలుగు రకాల వృత్తి ధర్మములు నా చేత సృష్టించబడ్డాయి. ఈ వ్యవస్థకి నేనే సృష్టికర్త అయినా నన్ను అకర్తగా మరియు సనాతనునిగా తెలుసుకొనుము.
విశ్లేషణ: వేదములు జనులను నాలుగు రకాల వృత్తులవారీగా విభజించాయి, ఇవి వారి స్వభావం అనుగుణంగా చేసినవి కానీ వారి పుట్టుకను బట్టి చేసినవి కావు. దాని ప్రకారం, భౌతిక శక్తి మూడు గుణములతో సమ్మిళితమై ఉంటుంది : సత్త్వ గుణము, రజో గుణము, తమో గుణము. బ్రాహ్మణులు అంటే సత్త్వ గుణం ప్రధానంగా ఉన్నవారు. వారికి స్వాభావికంగా బోధన మరియు భగవత్ ఆరాధన అంటే మొగ్గు చూపుతారు. క్ష్యత్రియులు రజో గుణ ప్రధానముగా ఉండి, స్వల్పంగా సత్వ గుణం మిళితమై ఉంటారు. వీరు పరిపాలన మరియు యాజమాన్యం వైపు మొగ్గు చూపుతారు. వైశ్యులు రజో గుణము మరియు కొంత తమో గుణము మిళితమై ఉంటారు. కాబట్టి వారు వ్యాపారము మరియు వ్యవసాయం ప్రధానంగా ఉంటారు. తరువాత, శూద్రులు, వీరు తమో గుణ ప్రధానంగా ఉంటారు. వీరు శ్రామిక వర్గముగా ఉంటారు. ఈ వర్గీకరణ అనేది జన్మతహా వచ్చినవి కావు లేదా మార్చలేనివి కావు. ఈ వర్ణాశ్రమ వర్గీకరణ అనేది జనుల స్వభావము మరియు చేష్టల ఆధారంగా ఉంటుంది అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.
భగవంతుడు ఈ ప్రపంచ వ్యవస్థకి సృష్టికర్త అయినా, ఆయన అకర్తగా ఉంటాడు. ఇది వర్షము వంటిది. అడవిలో వర్షపాతం అంతటా సమానంగా పడినా, కొన్ని విత్తనాల నుండి పెద్ద మర్రి చెట్లు వస్తాయి, మరికొంత విత్తనాల నుండి అందమైన పుష్పములు పూస్తాయి, మరివేరే వాటినుండి ముళ్ళపొదలు వస్తాయి. ఆ వర్షం అన్నిటిపట్ల పక్షపాతం లేకుండా సమంగా కురుస్తుంది, ఈ వ్యత్యాసానికి బాధ్యత దానిది కాదు. ఇదే విధంగా, భగవంతుడు జీవులకు కర్మలను చేసే శక్తిని ప్రసాదిస్తాడు, కానీ ఆ శక్తితో వారు ఏమి చేస్తారో వారికి పూర్తి స్వేచ్ఛ ఉంది. వారి చర్యలకు భగవంతుడు కారణం కాదు.

న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహా ।
ఇతి మాం యోఽభిజానాతి కర్మభిర్న స బధ్యతే ।। 14 ।।
కర్మలు నన్ను అంటవు, నేను కర్మఫలముల యందు కూడా ఆసక్తుడను కాదు. ఎవరైతే నన్ను ఈవిధంగా తెలుసుకుందురో, వారు కర్మ బంధములలో చిక్కుకోరు.
విశ్లేషణ: ‘అపవిత్రమైన వ్యక్తులు లేదా వస్తువుల సంపర్కం వలన కూడా, పరిశుద్ధమైన వ్యక్తిత్వములు దోషములచే ఎప్పుడూ కళంకితులు కారు. ఉదాహరణకి సూర్యుడు, అగ్ని, గంగా నది వంటివి.’ సూర్యరశ్మి, మూత్రపు నీటి కుంటపై పడితే సూర్యుడు కలుషితం కాడు. సూర్యుడు తన పరిశుద్ధ అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే ఆ అశుద్ధమును కూడా శుద్ధి చేస్తాడు. అదే విధంగా, అగ్నిలో అపవిత్రమైన పదార్థములు సమర్పించినా, అది తన స్వచ్ఛత నిలుపుకుంటుంది – అగ్ని స్వచ్ఛమైనది, మనం ఏది దానిలో వేసినా అది కూడా శుద్ధమైపోతుంది. ఇదే విధంగా, ఎన్నో మురికి కాలువలు పవిత్ర గంగా నదిలో కలుస్తుంటాయి, కాని గంగా నది మురికి కాలువ అయిపోదు – గంగా నది పవిత్రమైనది, అంతేకాక, ఆ మురికి కాలువలన్నిటినీ గంగా నదిగా మార్చివేస్తుంది. అదే విధంగా, భగవంతుడు కూడా తను చేసే కర్మల వలన కళంకితుడు కాడు.
చేసే పనుల వలన వచ్చే ఫలములను తన భోగం కోసం చేస్తే ఆ కర్మలు వ్యక్తిని కర్మబంధములలో పెనవేస్తాయి. కానీ, భగవంతుని చర్యలు స్వార్థ ప్రయోజనం కోసం చేసినవి కావు; ఆయన ప్రతిఒక్క చర్య కూడా జీవులపై కరుణతో చేసినదే. కాబట్టి, ఆయనే ఈ జగత్తునంతా ప్రత్యక్షంగానో, పరోక్షం గానో అజమాయిషీ చేస్తూ మరియు ఈ వ్యవహారంలో ఎన్నో పనులు చేసినా, ఆయనకి కర్మ ప్రతిచర్యలు అంటవు. తను ఈ కర్మ ఫల బంధాలకు అతీతుడనని శ్రీ కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు.
భగవత్-ప్రాప్తి నొందిన ఋషులు కూడా భౌతిక శక్తికి అతీతులుగా అవుతారు. వారి యొక్క అన్ని కార్యక్రమాలు, భగవత్ ప్రేమచే ప్రేరేపితమౌతాయి కనుక అటువంటి పరిశుద్ధ మనసున్న సత్పురుషులు కర్మ ఫల బంధములలో చిక్కుకోరు. శ్రీమద్భాగవతం ఇలా పేర్కొంటున్నది:
యత్పాదపంకజ పరాగ నిషేవ తృప్తాః
యోగ ప్రభావ విధుతాఽఖిల కర్మ బంధాః
స్వైరం చరంతి మునయో ఽపి న నహ్యమానాః
తస్యేఛ్చయాత్త వపుషః కుత ఏవ బంధః (10.33.35)
‘భగవంతుని పాదారవింద ధూళి సేవలోనే సంపూర్ణ తృప్తి పొందే భక్తులను ప్రాపంచిక క్రియాకలాపములు ఎన్నటికీ కళంకితం చేయవు. యోగబలముచే కర్మ-ఫల బంధముల నుండి తమను తాము విడిపించుకున్న వివేకవంతులైన మునులను కూడా ప్రాపంచిక క్రియాకలాపములు కళంకితం చేయవు. మరింక, తన స్వ-సంకల్పము చేతనే అలౌకిక రూపమును ధరించే భగవంతునికి ఈ బంధములు ఉండే ప్రశ్నేఎక్కడిది?’

1 - 0

MUKKANTI EDITION
Posted 2 weeks ago

ప్రళయం సంభవించి భూలోకమంతా జలమయమయినప్పుడు, బ్రహ్మదేవుడు ఉద్భవించి,
ఆ తరువాత ఎన్నో లోకాలను, దేవగణాలను, వివిధరకాల జలసమూహాలను, స్థలచరాలను సృష్టించాడు.

అందుకే బ్రహ్మని జగత్స్రష్ట అంటారు. విశ్వకర్మన్, బ్రహ్మణస్పతి, హిరణ్యగర్భ అనే పేర్లతోనూ మొదటగా ఉద్భవించినవాడు కాబట్టి పరబ్రహ్మ, పరమాత్మగానూ చెప్తారు.

సమస్తమయిన మంగళప్రద కార్యాలలో బ్రహ్మను స్మరించటం, పూజించటం ఉండేది. సర్వతోభద్ర, లింగతోభద్ర, వాస్తుమండల మొదలైన వాటిలో వారికి ప్రాధాన్యం ఇచ్చేవారు.

బ్రహ్మ, నారాయణ, పురుషుడు, మహానుభావుడు అనే పేర్లతో శాస్త్రాలలో కనిపిస్తాడు. దేవదానవ, యక్ష, కిన్నెర, రాక్షసులందరికీ బ్రహ్మదేవుడు తాతగారే.

సృష్టి రచానాకారుడు అవ్వడంచేత ఇతడు ధర్మపక్షపాతి. దేవదానవ మానవులు ఎవరైనా సరే సమస్యలలో చిక్కుకుంటే ముందు బ్రహ్మ దగ్గరకే వెళతారు.

సృష్టి ఆరంభములో హిరణ్యగర్భం నుంచి స్వయంభువుగా బ్రహ్మ ఉద్భవించాడని చెబుతారు.
విష్ణువు నాభి నుండి వెలువడిన కమలమే బ్రహ్మ ఆసనం.

ఆ కమలంలోని బొడ్డుని సుమేరు పర్వత స్వరూపంగా భావిస్తారు. వేదాలు, పురాణాలు, స్మృతులు అన్నీ బ్రహ్మని సృష్టికర్తగా చెప్తారు.

బ్రహ్మదేవుడు తొమ్మిది రూపాలలో భక్తులను అనుగ్రహిస్తాడు.

బ్రహ్మ తొమ్మిది రూపాలు:-
1. కుమారబ్రహ్మ
2. అర్కబ్రహ్మ
3. వీరబ్రహ్మ
4. బాలబ్రహ్మ
5. స్వర్గబ్రహ్మ
6. గరుడబ్రహ్మ
7. విశ్వబ్రహ్మ
8. పద్మబ్రహ్మ
9. తారకబ్రహ్మ

ఇలా తొమ్మిది రూపాలతో తొమ్మిది శివలింగాలను ప్రతిష్ఠించి బ్రహ్మదేవుడు పూజించిన పుణ్యప్రదేశమే మనరాష్ట్రంలోని అలంపూర్ క్షేత్రం.
ఇటువంటి అరుదైన క్షేత్రం మనదేశంలో ఇదే.‪@mukkantiedition‬ ‪@jagathsrishti‬

48 - 1

MUKKANTI EDITION
Posted 4 weeks ago

మకర సంక్రాంతి సమయంలో సూర్యుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తాడు?

10 - 0