సద్గురు జగ్గీ వాసుదేవ్ గారి (ఈశా యోగా కేంద్రం సంస్థాపకులు) అధికారిక యూట్యూబ్ ఛానల్.
Join #Mahashivratri2023 sadhguru.co/msr23-te
యోగి, మార్మికులు, దార్శనికుడు అయినటువంటి సద్గురు ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు. 'యోగా' అనేది ఒక పురాతన నిగూఢ శాస్త్రం కాదని, ఈ రోజుల్లో కూడా ఎంతో ఉపయోగపడే ఒక సమకాలీన శాస్త్రం అని వారి జీవితం, వారి కార్యకలాపాలు మనకు గుర్తుచేస్తాయి. జీవితంతో అన్ని విధాలుగా ఎంతో అద్భుతంగా మమేకమైవున్న సద్గురు - నిర్మాణ శాస్త్రం, పర్యావరణం, క్రీడలు, సంగీతం, కవిత్వం, చిత్రలేఖనం వంటి వివిధ రంగాలలో చాలా చురుకుగా పాలుపంచుకుంటారు. ఆయన ప్రసంగాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. మానవ హక్కులు, వ్యాపార ధర్మాలు, సంఘ, పర్యావరణం వంటి వివిధ అంశాలపై ఆయన ఇచ్చే ఉపన్యాసాలకు ప్రముఖ ప్రపంచ వేదికలపై ఎంతో ఆదరణ ఉన్నది.
మరింత తెలుసుకోవడానికి చూడండి: isha.sadhguru.org