in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
రామ్‌చరణ్, ఉపాసన కుమార్తె పేరు - క్లీంకార కొణిదెల
ఓంకార రూపిణి క్లీంకార వాసిని
జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి ॥
1 - 0
*రాష్ట్రంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా, అధిక సంఖ్యలో పిల్లల తల్లితండ్రులు మరియు అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు కోరుతున్నాందున, పాఠశాలల పున ప్రారంభాన్ని వారం రోజులు పాటు వాయిదా వేయాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ని, విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ ని కోరిన...ఎమ్మెల్సీ లు కల్పలత రెడ్డి* , *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మరియు రామ చంద్రారెడ్డి...*
2 - 0
వై వి ఆంజనేయులుతో కన్నా లక్ష్మీ నారాయణ గారు భేటీ
వై వి ఆత్మీయులతో కలిసి అల్పాహారం చేసిన కన్నా...
నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశానికి వై వి ని ఆహ్వానించిన కన్నా..
సమిష్టిగా కృషి చేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చిన కన్నా , వై వి.
మాజీ మంత్రివర్యులు,సత్తెనపల్లి నియోజకవర్గం తెదేపా ఇంచార్జ్ కన్నా లక్ష్మీ నారాయణ గారు సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే వై వి ఆంజనేయులు గారి గృహంలో సోమవారం ఉదయం మర్యాద పూర్వక భేటీ అయ్యారు. కన్నా లక్ష్మీ నారాయణ గారు వై వి గారి ఇంటికి వస్తున్నారనే సమాచారం తో సత్తెనపల్లి నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, సత్తెనపల్లి పట్టణం నుంచి వై వి అభిమానులు తరలివచ్చి వచ్చి కన్నా గారికి స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు వై వి అభిమానులుతో కలిసి అల్పాహారం స్వీకరించారు. అనంతరం వై వి అంజనేయులు గారు మండలాల వారిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున పరిచయం చేస్తూ ప్రస్తుతం పార్టీలో చేస్తున్న పదవీ,గతంలో వారు పార్టీలో చేపట్టిన పదవులు, పార్టీ కోసం వారు చేసిన, చేస్తున్న కృషిని కన్నా గారికి ప్రత్యేకంగా తెలియజేశారు. ఈ సంధర్భంగా వై వి ఆంజనేయులు గారు మాట్లాడుతూ రాజకీయాలలో అపార అనుభవం ఉన్న నాయకులు కన్నా లక్ష్మీనారాయణ గారని గుర్తు చేశారు. ఆ అనుభవంతో నియోజకవర్గం అభివృద్ధిలో , ప్రజా సమస్యల పరిష్కారంలో నమ్మిన వారికోసం నిస్వార్థంగా పనిచేయగల సమర్థులు కన్నా గారన్నారు. అధిష్టానం ఆదేశానుసారం మనమందరం సమైక్యంగా,సమిష్టిగా సత్తెనపల్లి ఎమ్మెల్యేగా కన్నా గారిని , రాష్ట్ర భవిష్యత్ కోసం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
*నన్ను నమ్మి ఓటు వేయండి..మీ వెంట నేనుంటా : కన్నా *
కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ వై వి ఆంజనేయులు గారు చెప్పినట్లు నేను రాజకీయాలకు కొత్త కాదని, 25 సంవత్సరాలు శాసనసభ్యునిగా, 16 ఏళ్ళు మంత్రిగా పని చేసిన అనుభవం ఉందన్నారు. మన పక్క నియోజకవర్గం పెదకూరపాడు ప్రజలనడిగితే చెబుతారన్నారు. ప్రతి ఇంటితో ప్రతి మనిషితో మానవ సంబంధాలు ఉండేవని ,వారి అవసరాల దృష్ట్యా వారికి ఏ అవసరం ఉన్నా ఆ పని చేసేవాడినన్నారు. ఈ సంధర్భంగా ఒక సంఘటన గుర్తు చేస్తున్నానని, 1989 లో మొదటి సారి పెదకూరపాడులో పోటీ చేసేటప్పుడు నాకు ఆ నియోజకవర్గం ఫై కనీస అవగాహన లేదన్నారు. ఆ నాటి ఎన్నికలలో పెదకూరపాడు ప్రజలకు ఒకటే చెప్పానని , నన్ను నమ్మి ఓటు వేయండి..మీ వెంట నేనుంటా అని హామీ ఇచ్చానన్నారు. ప్రజలు నమ్మి ఓటు వేసి, గెలిపించినందుకు ఆ నియోజకవర్గం ప్రజలు కోరిక మేరకు మంత్రి పదవి ఇస్తానన్నా వద్దు అని ఎద్దు వాగు బ్రిడ్జీ నిధులు మంజూరు చేయించుకుని నిర్మాణం చేపట్టి మాట నిలుపుకున్నానని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు కోసం కాకపోయినా రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా, నవ్యాంధ్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణం కోసం నారా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవటమే మనందరి ముందున్న ఏకైక లక్ష్యమన్నారు. ఈ నెల 9 న జరుగనున్న సత్తెనపల్లి నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశానికి రావాలని వై వి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి చౌట శ్రీనివాసరావు, పట్టణ పార్టీ అధ్యక్షులు కటకం రామకృష్ణ , ముప్పాళ్ళ, సత్తెనపల్లి రూరల్ , రాజుపాలెం మండల అధ్యక్షులు బత్తుల నాగేశ్వరరావు , ఆళ్ల అమరేశ్వరరావు , పల్లపాటి పెద్దిరాజు , క్లస్టర్ భాద్యులు అన్నదాసు వెంకట రామయ్య , రావిపాటి దేవేంద్రరావు , అబ్భురు గోపి ,గద్దె అప్పారావు , నియోజకవర్గంలో నాలుగు మండలాలు , పట్టణ ముఖ్య నాయకులు , వై వి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
#kanna #tdp #sattenapalli
0 - 0
హైదరాబాద్:
టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ..
చంద్రబాబు నివాసంలో కొద్దిసేపటి క్రితం ఇరువురు నేతల సమావేశం..
రాష్ట్రంలో పరిస్థితులు, ప్రజా సమస్యలపై చర్చ..
1 - 0
ప్రతి ఒక్కరూ చిన్న పనితో ప్రారంభిస్తారు. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా దీన్ని ఇంట్లో సులభంగా చేయవచ్చు.
వాటర్ బాటిల్ ఎక్కడైనా సులభంగా దొరుకుతుంది. ప్రతి ఇంటికి ప్రతిరోజూ కనీసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్లాస్టిక్ సంచులు అందుతాయి, (నూనె సంచులు, పాల సంచులు, కిరాణా సంచులు, షాంపూ, సబ్బు, మాగీ, కుర్కురే మొదలైనవి) సీసాలో పోయాలి.
మీరు వారానికి ఒకసారి సీసాని నింపవచ్చు మరియు సరైన మూతతో డస్ట్‌బిన్‌లో వేయవచ్చు. ఇలా చేయడం వల్ల జంతువులు చెల్లాచెదురుగా ఉన్న ప్లాస్టిక్‌ను తినవు.
ప్లాస్టిక్ వ్యర్థాలు, వాటర్ బాటిళ్లను సక్రమంగా పారవేసే అవకాశం ఉంటుంది. చెత్తను నిక్షిప్తం చేసే వెసులుబాటు కూడా చెత్త శాఖకు ఉంటుంది.
ఇలాంటి చిన్న పని పర్యావరణానికి, భూమికి, రాబోయే తరాలకు ఎంతో మేలు చేస్తుంది. ఈ పనిని ప్రతి ఒక్కరూ చేయగలిగిన సమయంలో వీలైనంత వరకు 100% చేయడానికి ప్రయత్నించండి.
నగరం నుంచి పల్లె వరకు ప్రతి ఇంట్లో ఈ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఇంటివారు ఈ ఆవశ్యకతను గుర్తించి ఈ శుభ కార్యాన్ని ప్రారంభించవలసిందిగా వినయపూర్వకమైన మనవి.
*ప్లాస్టిక్ నిర్మూలన పథకంతో భారతదేశం.*
0 - 0
*వచ్చే ఎన్నికల్లో విశాఖపట్టణం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ*
. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానన్న సీబీఐ మాజీ జేడీ.
1 - 0
*ఆలపాటి రాజేంద్ర ప్రసాద్* మాజీ మంత్రివర్యులు *
పాయింట్స్
*వివేకా హత్యకు కర్త, కర్మ, క్రియ అన్ని తాడేపల్లి ప్యాలస్*
*సీబీఐ లోతుగా విచారణ జరిపి తాడేపల్లి ప్యాలెస్ పాత్ర ను కూడా బహిర్గతం చేయాలి*
*భాస్కర్ రెడ్డి అరెస్ట్ తో వివేకానందరెడ్డి కన్నును ఏ కన్ను పొడిచిందో ప్రపంచానికి తెలిసింది*
*వివేకా హత్య కేసులో పెద్ద తిమింగలాలను వదిలేసి చిన్న చిన్న చేపలను పట్టుకుంటున్నారు*
*సీబీఐ తర్వాత అరెస్ట్ చేసేది తాడేపల్లి ప్యాలెస్ పెద్దలనే*
1 - 0
గుంటూరు టివి తెలుగు గుంటూరు చానల్ చూస్తున్న వీక్షకులందరికి నమస్కారములు. గుంటూరు టివి చానల్ నందు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వార్తలు, సాంఘిక మరియు సాంస్కృతిక కార్యక్రమములు, విద్య ,ఆరోగ్య సంభదిత సమాచారం, నిరంతరం ప్రసారం చేయబడును. మా చానల్ చూస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదములు.
---------------------------------------------------------------------------
గుంటూరు టివి తెలుగు నందు ఈవెంట్ ప్రమోషన్లు, వ్వాపార ప్రకటనల కోసం ఈ క్రింది మెయిల్ లేదా నంబర్లను సంప్రదించగలరు.
nagarajuponugubati@gmail.com
Phone :: 9440906055
For Business advertisements and Event promotions please contact bellow adress…..
nagarajuponugubati@gmail.com
Phone :: 9440906055