EV Telugu is the first and #1 Youtube Channel Dedicated for Electric Vehicles in Telugu - EV Reviews, EV News, EV Start-Up Stories, EV TestRides, Solar Reviews & Solar News will be covered.
ఈ రోజుల్లో వాతావరణ కాలుష్యం అనేది అతి పెద్ద సవాలుగా మారింది. ఎవరికి వారు నాగరికత పేరిట, సాంకేతికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతున్నాం అనుకుంటున్నారే గాని, తాము కూర్చున్న చెట్టుని తామే నరుక్కుంటున్నామనే నిజాన్ని గ్రహించలేకపోతున్నారు. అభివృద్ధి అవసరమే కానీ, ఆ అభివృద్ధి స్వచ్ఛంగా ఉండాలి కానీ కలుషితం కాకూడదు, మనకో లేదా తరువాతి తరాలకో శాపంగా మారకూడదు.
కాలుష్యానికి అతి పెద్ద కారణం మన వాహనాల నుండి వెలువడే వ్యర్థ పదార్థాలే. కాబట్టి, మనం విద్యుత్ శక్తితో నడిచే వాహనాలను వినియోగించటం వలన పెరుగుతున్న ఈ పెనుభూతాన్ని చాలా వరుకూ అడ్డుకోవచ్చు.
అందరిలో విద్యుత్ వాహనాల పట్ల పూర్తి అవగాహనను కలిగించాలనే సదుద్దేశంతోనే , ఈ ఛానల్ లో భారతదేశంలో రానున్న విద్యుత్ వాహనాల గురించి సమాచారాన్ని పొందుపరచడం జరుగుతుంది.
"పెరుగుతున్న కాలుష్యాన్ని అదుపు చేయటం మన బాధ్యతే కాదు, అత్యవసరం కూడా!"
Whatsapp / Ph - 9010368463