మహా వృక్షం అయిన మర్రిచెట్టు నీడలో ఉన్న మొక్క ఎంత ప్రయత్నించినా ఎదగలేదు అదే విధంగా ఒక శ్రేష్ఠుడి సమక్షంలో మన సామర్థ్యం వ్యర్థం అవుతుంది . ఏ విధంగా అయితే ఎన్ని పోషాకాలు ఉన్న ఆ మొక్క మహావృక్షం నీడలో ఎదగలేదో అదె విధంగా శ్రేష్ఠుడి రక్షణలో ఎంత సామర్థ్యం ఉన్నా మన ఉనికిని చాటుకోలేము. మహావృక్షం నీడలో నుండి మొక్కను వేరు చేస్తే ఆ మొక్క కూడా మరో మహా వృక్షం గా ఎదగ గలదు. శ్రేష్ఠుడి నీడలో నుండీ వేరు కావడం ద్వారా సమర్థుడైన వాడు తన ఉనికిని చాటుకొని శ్రేష్ఠుడిగా అవతరించగలడు.