అందరికీ నమస్కారం. మాది పక్కా పల్లెటూరి అండి. పల్లెటూర్లలో ఉండే ఆహారపు అలవాట్లు, వండేటటువంటి వంటలు ఏ విధంగా ఉంటాయో మీకు చూపించాలని అనుకుంటున్నాను. కనుక నా ఛానల్ పేరు టేస్టీ పల్లెటూరు వంటలు అని పెడుతున్నానండి. నేను మీరు యూట్యూబుల్లో చూసే ప్రతి వంటకాన్ని పల్లెటూర్లలో ఏ విధంగా సులువుగా సులభంగా వండుతారో చూపించాలనుకుంటున్నానండి. అంతేకాదు పల్లెటూరులలో దొరికేటటువంటి కూరగాయలు ఆకుకూరలు మాంసాహారాలు మొదలైన వాటితోనే సులభంగా తక్కువ ఖర్చులో ఏ విధంగా రుచికరంగా చేసుకోవాలో మీకు చూపించాలి అనుకుంటున్నానండి. కాలాలవారీగా పల్లెటూర్లలో ఏ కాలంలో ఎటువంటి ఆహార పదార్థాలు దొరుకుతాయో వాటితోనే మీకు రుచికరంగా ఎలాగా వంటలు చేయాలో చూపించబోతున్నాను. అంతేకాదు పల్లెటూర్లలో వండేటటువంటి పిండివంటలు స్వీట్స్ మొదలైన వాటిని చాలా సులువుగా వండి మీకు చూపించబోతున్నానండి. దయచేసి నా ఛానల్ ను ఆదరించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.