0 Views • Jun 13, 2024 • Click to toggle off description
** పెండ్యాల పంపింగ్ స్కీం ద్వారా ఆయికట్టుకు సాగునీరు విడుదల.
** ప్రతి చేనుకు నీరు.. ప్రతి ఒక్కరికీ పని అనే నినాదంతో ముందుకు వెళతాం
** నియోజకవర్గం సమస్యల పరిష్కారం, అభివృద్ధికి కృషి చేస్తా
..మంత్రి కందుల దుర్గేష్
సమాజానికి అన్నం పెట్టే రైతుకు సాగునీరు అందించే కార్యక్రమంలో మంత్రి హోదాలో తొలిసారిగా పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
గురువారం నిడదవోలు మండలం సీతంపేటలో " పెండ్యాల పంపింగ్ స్కీం " ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టు రైతాంగానికి సాగునీరు అందించే కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొని సాగునీరు విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా నియోజకవర్గానికి విచ్చేసి మొట్టమొదటిగా రైతులకు సాగునీటిని అందించే కార్యక్రమంలో పాల్గొనటం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ ప్రభుత్వం హయంలో ప్రతి చేనుకు నీరు.. ప్రతి ఒక్కరికీ పని అనే నినాదంతో ముందుకు వెళతామని రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి వర్యులు కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.
సుదీర్ఘ అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని, ఆశయ సాధనకు కట్టుబడి ఉండాలనే ధృడ సంకల్పం కలిగిన పవన్ కళ్యాణ్ పై అచంచలమైన విశ్వాసంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ మద్దతు కలిగిన కూటమిని ప్రజలు అధికారంలోకి తీసుకుని రావడం జరిగిందన్నారు. ప్రజలు చూపెట్టిన ఆకాంక్షల మేరకు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. జల వనరుల పథకాలు ఏర్పాటు చెయ్యడం కాకుండా వాటి నిర్వహణ కొరకు తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళడం అత్యంత కీలకం అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్వహణ, కాలువలలో పూడిక తీత పనులకు తగిన మరమ్మత్తులు చెయ్యకపోవడం వల్ల చివరి భూములు వరకు సాగునీరు అందించే క్రమంలో ఇబ్బందులు ఎదురైన విషయాన్ని మంత్రి దుర్గేష్ ప్రస్తావించారు. రానున్న రోజుల్లో సాగు చేసే చేనుకి సజావుగా నీరు అందేలా, ప్రతి ఒక్కరికీ పని కల్పించే విధంగా మన ప్రభుత్వము పని చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఆ క్రమంలో ఇరిగేషన్ కాలువల నిర్వహణ కోసం ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్నారు. మంత్రిగా క్యాబినెట్ సమావేశంలో పాల్గొని ఇటువంటి సమస్యలను ప్రస్తావించి, సానుకూలమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్ళడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. బూరుగుపల్లి శేషారావు వంటి అపార అనుభవం నాయకులు, తదితరులతో కలిసి పని చేస్తూ నియోజక వర్గం సమస్యలు పరిష్కారం కోసం పని చెయ్యడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అధికారులు నిర్లిప్త వైఖరిని విడనాడి, చేపట్టవలసిన పనుల విషయంలో తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రావాలని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కారం కోసం అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని, ప్రభుత్వ పక్షాన తగిన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంటానని చెప్పారు.
పెండ్యాల పంపింగ్ స్క్రీన్ ద్వారా నిడదవోలు పెరవలి మండలాల్లోని 14 గ్రామాలలోని 6,626 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.
తొలుత రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి మొదటిసారిగా నిడదవోలు నియోజకవర్గానికి విచ్చేసిన కందుల దుర్గేష్ కు నాయకులు, కార్యకర్తలు, పలువురు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు దేవాలయాల్లో మంత్రి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, ఇరిగేషన్ శాఖ ఈ ఈ ఎం.దక్షిణ మూర్తి, డీ ఈ వి.సత్యదేవ, జే ఈ
ఎస్.కిరణ్ కుమార్, స్థానిక నాయకులు మునికోటి దుర్గారావు, ఉండి శ్రీను,
స్థానిక రైతులు, గ్రామ ప్రజలు కోయి శ్రీను,బొంబోతు త్రినాథ్ ( బుజ్జిబాబు)పూటి వెర్రిబాబు,యర్రంశెట్టి మురళీకృష్ణ, శనగన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Metadata And Engagement
Views : 0
Genre: News & Politics
Uploaded At Jun 13, 2024 ^^
warning: returnyoutubedislikes may not be accurate, this is just an estiment ehe :3
Rating : 0 (0/0 LTDR)
0% of the users lieked the video!!
0% of the users dislieked the video!!
User score: 0.00- Overwhelmingly Negative
RYD date created : 2024-11-25T08:51:30.6470245Z
See in json
Tags
0 Comments
Top Comments of this video!! :3