అందరికీ నమస్కారం, నా పేరు బాబూరావు. నా వయస్సు 31 సంవత్సరాలు. మాదిగబంధ గ్రామం, పాడేరు మండలం, వనుగుపల్లి పోస్ట్, అల్లూరి సీతా రామరాజు జిల్లా, నా భార్య పేరు పద్మ, మాకు 3 సంవత్సరాల బాబు ఉన్నాడు, పేరు చింటూ బాబు, మాతో పాటు మా కజిన్ బ్రదర్ కొడుకు గణేష్, వయస్సు 19 సంవత్సరాలు. అతను మాతో పాటు వీడియోలలో కూడా కనిపిస్తాడు. మరియు నేను డిగ్రీ (B.Com) పూర్తి చేసాను. డిగ్రీ పూర్తయ్యాక ఐదేళ్లు ఉద్యోగం చేశాను. జాబ్ చేసే టప్పుడు వంట నేర్చుకున్నాను. ప్రస్తుతం కాఫీ తోటను చూసుకుంటూ యూట్యూబ్‌లో వీడియోలు కూడా చేస్తాను. మా ఛానెల్ పేరు నా గిరిజన ప్రపంచం. నాకు వచ్చిన వంటకాలతో పాటు మా కుటుంబంలో జరిగే సంఘటనలు మరియు మా జీవన విధానం గురించిన వీడియోలను మా ఛానెల్లో అప్లోడ్ చేస్తాను. హోటల్ స్టైల్లో కూరలు కూడా చేస్తాను. మా జీవన శైలి మరియు మా వంటకాలు మీకు ఖచ్చితంగా నచ్చుతాయని నేను భావిస్తున్నాను. ఒక్కసారి మా వీడియోస్ చూడండి. మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరించండి. 🙏🙏🙏
అందరికీ ధన్యవాదాలు