No content on this channel :c try Try Looking at shorts maybe lol :p
కత్తి ఎప్పుడు పదునుగా ఉండాలి .. శిష్యుడు ఎప్పుడు ఎరుకతో ఉండాలి
"ధ్యానం .. మౌలిక ఇంగితజ్ఞానాన్ని కలుగజేస్తుంది”
విద్యార్థి జీవనానికి కావలసినవి “ఏకాగ్రత” .. “పట్టుదల” .. “జ్ఞాపకశక్తి” .. “ఏకసంధాగ్రాహ్యత”. “చురుకుదనం” .. “ఉత్సాహం” .. “శక్తి” .. ఇవన్నీ కూడా పిల్లలు పుట్టుకతోనే సహజంగా కలిగి వుంటారు కనుక ప్రతిరోజూ వాళ్ళతో నిర్ణీత సమయంలో ధ్యానం చేయిస్తూంటే వారు తమలోనే నిక్షిప్తం అయివున్న ఈ అద్భుతలక్షణాలను ఎరుకలోకి తెచ్చుకోగలుగుతారు.
“ధ్యానవిద్య” అన్నది ఏ ఒక్క మతానికో ప్రత్యేకంగా సంబంధించినది కాదు. అది ఒక శాస్త్రం. ధ్యానం ద్వారా మనస్సును శాంతంగా వుంచుకోవడం అన్నది ఒక మౌలిక ఇంగితజ్ఞానం..
ధ్యానం లేకపోతే .. ముఖ్యంగా విద్యార్థులకు .. ఏ రోజు కూడా పూర్తి కాజాలదు. ఈ ఐదు వ్రేళ్ళల్లో చూసుకుంటే అన్నిటికన్నా ముఖ్యమైంది బొటనవ్రేలు కనుక విద్యార్థి జీవితంలో అన్నింటికన్నా ముఖ్యమైనది ధ్యానం. “ధ్యానం” అన్నది ఎంత బాగుంటే మన పాటలు అంత బాగుంటాయి; “ధ్యానం” అన్నది ఎంత బాగుంటే మన చదువులు అంతగా బాగుంటాయి. “ధ్యానం” అన్నది ఎంత అద్భుతంగా వుంటే అంత అద్భుతంగానూ మన పనులలో ప్రావీణ్యత సిద్ధిస్తుంది.