సత్యాన్వేషణ మండలి
సత్యం తెలియడం అనేది కేవలం సత్యాన్వేషకులకు సంబంధించిన ప్రత్యేక అభిరుచికి సంబంధించినది మాత్రమే కాదు. అది ప్రతి మనిషి జీవితావసరం. జీవితం అనే నిర్మాణానికి పునాది వంటిది కూడా.
సత్యం అంటే ఏమిటి? ఆయా విషయాలకు సంబంధించి ఏది సత్యం? ఏది అసత్యం? సత్యాన్ని తెలుసుకోవడం ఎలా? సత్యాసత్యాలు తేల్చుకోవడం ఎలా? అన్న ఆలోచన ఆధారంగా ఉనికిలోకి వచ్చిన లేదా ఆరంభించబడిన సంస్థ సత్యాన్వేషణ మండలి. స.మం. దీని పొట్టి పేరు.
మండలి ప్రధాన లక్ష్యం ప్రజలలో వాస్తవిక దృష్టిని, సత్యాన్వేణాశక్తిని, వివేకాన్ని, ధర్మాచరణను పెంపొందించడం ద్వారా వ్యష్టి, సమష్టి, శ్రేయస్సుల పట్ల అవగాహన కల్పించడం. అందుకు పునాదిగా ఆధ్యాత్మిక తాత్విక మరియు విజ్ఞాన శాస్త్రాల సక్రమ సమన్వయం ద్వారా మానవ అభివృద్ధికి పాత కొత్తల మేలు కలయికతో మార్గ నిర్దేశం చేయటం.
మండలి ఆవిర్భావం