మనిషి జీవితంలోని ప్రతి ముఖ్యమైన మలుపు పాటతో మమేకమై ఉంది. అటువంటి పాటలే లాలి పాటలు, జోల పాటలు కూడా.అలసిన పసిబిడ్డను హాయిగా నిద్రపుచ్చే క్రమంలో నింగి, నేల, చందమామ, చెట్టు, పుట్ట, పశువులు, పక్షులు ఇలా ప్రకృతిలోని ప్రతి అంశం పాటగా మార్చి ఆ కన్నతల్లి బిడ్డకు జోల పాడుతుంది. అంతేకాదు పురాణాలు, కథలు, చరిత్ర మొదలైన వాటితోపాటు జీవితంలో అనుభవిస్తున్న కష్టసుఖాలు, దుఃఖాలు అన్నిటిని కూడా పాటగా కట్టి గుండె గూటిలో దాగిన భావాలను లాలిపాటగా పల్లవించే సాంస్కృతిక నేపథ్యం మనకు మాత్రమే సొంతం. కానీ మన కమ్మనైన లాలి పాటలు, జోల పాటలు కనుమరుగవుతున్న తరుణం ఇది. జోల పాటలు కనుమరుగవుతున్న ఈ తరుణంలో మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతమ్మలు పాడిన కమ్మనైన లాలిపాటల పరంపరను, ఆ కమ్మదనాన్ని రాబోయే తరాలకు అందించాలనే సత్సంకల్పం.
ఇంత చక్కని ప్రయత్న ఇటువంటి మంచి పాటలు ఇంకా మీ దగ్గర కనుక ఉంటే అందులో మంచి పాటలను తీసుకొని వాటిని కూడా ఆల్బమ్ గా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది శివమస్తు క్రియేషన్స్. మీరు సేకరించిన పాటలను కింద ఇస్తున్నటువంటి ఈమెయిల్ అడ్రస్ కి పంపించగలరు. shivamasthuc@gmail.com
Team
Shivamasthu Creations