Editor : తుర్లపాటి నాగభూషణ రావు. వీరి ఆశయాలకు అనుగుణంగా ఈ ఛానెల్ లో కార్యక్రమాల రూపకల్పన జరుగుతున్నది. AP government నుంచి తెలుగు భాషా రత్న జీవన సాఫల్య అవార్డు (2024)అందుకున్న తుర్లపాటి గారు 40ఏళ్లుగా జర్నలిజంలో ఉంటూ తెలుగు భాషా వికాసానికి సేవ చేస్తున్నారు. వీరు గతంలో ఈనాడు , ఆంధ్రప్రభ, ఆకాశవాణి వార్తా విభాగం, TV5 news, tharanga radio station, greatandhra.com, telugu one.com వంటి సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. రాష్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు అందుకున్నారు . ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కోసం వీరు వ్రాసిన “అదిగో హరివిల్లు” రూపకానికి గాను జాతీయ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. తుర్లపాటి వారి కృషితో TV5 Channel ప్రతిష్టాత్మక నంది అవార్డు, యునిసెఫ్ అవార్డులు అందుకుంది. వీరి స్వగ్రామం NTR జిల్లా (AP) Nandigama.
చదువు : MSc (University of Bombay)
జననం : అడవిరావులపాడు గ్రామంలో 26-01-1957