No content on this channel :c try Try Looking at shorts maybe lol :p
ఇస్లామ్ సర్వసృష్టికర్త అయిన దైవం తన ప్రవక్తల ద్వారా
వివిధ కాలాలలో పంపిన మార్గదర్శకత్వం మరియు
సంపూర్ణ జీవనవిధానం. ఈ మార్గదర్శకత్వాన్ని తన
అంతిమ గ్రంధం దివ్య ఖుర్ఆన్ ద్వారానూ తన అంతిమ
ప్రవక్త ముహమ్మద్(స) ద్వారానూ పరిపూర్ణం చేసాడు.
చివరి ధర్మశాస్త్రం దివ్య ఖుర్ఆన్ సర్వమానవాళికి
బోధించే ముఖ్యమైన బోధన మానవులంతా ఒకే
తల్లిదండ్రుల సంతానం. మానవులందరి దైవం ఒక్కడే.
ఈ కాలంలో మనిషి ఇహపరలోకాల సాఫల్యానికి దైవం
పంపిన చివరి గ్రంధాన్ని చివరి ప్రవక్త ను అనుసరించాలి.
మనిషి మరణం తర్వాత మరో జీవితం ఉన్నది.
అది శాశ్వతం. ఇక్కడ మనిషి ప్రతీ కర్మ నమోదు
కాబడుతుంది. సమాధానం చెప్పుకోవాలి. ఇక్కడి
కర్మలను బట్టి శాశ్వత స్వర్గం లేక శాశ్వత శిక్షలు
ఉంటాయి. సర్వసృష్టికర్త అయిన దైవానికి వివిధ భాషల్లో
అనేక పేర్లు ఉన్నాయి. అల్లాహ్ అనేది అరబీ భాషలో
దైవానికి ఉపయొగించే పదం. దీని అర్థం ఆరాధనకు
తగినవాడు అని. ఆయన చావుపుట్టులకు మానవ
బలహీనతలకు అతీతంగా ఉంటాడు. మనిషి కాడు.
ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశ్యం.. ఇస్లామ్ పై నెలకొనిఉన్న
అపార్థాలను తొలగించి ఇస్లామ్ పై అవగాహన
కల్పించడం. ప్రజల మధ్య సామరస్యత కోసం కృషి
చేయడం. సమాజశాంతికై పాటుపడడం.