"ఎందరో మహానుభావులు - అందరికి వందనాలు"....
వేల సంవత్సరాల చరిత్ర వున్న మన పవిత్ర హిందూ దేశం తన జీవన విధానం ద్వారా, సంస్కృతి ద్వారా, సూక్ష్మమైన ధార్మిక విధానాల ద్వారా, బలమైన పునాది, పరిశోధన గల శాస్త్ర సాంకేతిక విద్య విధానాల ద్వారా ఒక్క ఈ అఖండ హిందూ సామ్రాజ్యం పైనే కాకుండా యావత్ ప్రపంచ జనాభా మీద ప్రభావం చూపి వారి జీవితాలలో ఆధ్యాత్మికత నిండిన సుఖ సంతోషాలను నింపింది. సృష్టి, స్థితి, లయ కారకులైన బ్రహ్మ, విష్ణు, మహేస్వరుల అంశతో యుగ యుగాల మానవ చరిత్ర నిండివుంది. ఆ త్రిమూర్తుల చుట్ట్టే భారతీయ జీవన్ విధానం, చరిత్ర తిరుగుతుంది. ఆ ప్రవాహంలో మానవ మథనం నుండి పుట్టినవే పలు పురాణాలు, వేదాలు, వివిధ ధార్మిక గ్రంధాలు, రామాయణ, మహా భారతాలు మొదలైన గ్రంధాలు. ఆ పరంపరలోనే పుట్టిన మునులు, మహర్షులు, చక్రవర్తులు, రాజులు, రాజ్యాలు, సంఘ సంస్కర్తలు, యోగులు మొదలగు మహానుభావులు భారతావని తరింప చేశారు. ఈ సుదీర్గ పయనంలో ఎన్నో దివ్య క్షేత్రాలు భారత దేసమంతట వెలిసాయి. ఇటువంటి ఉత్క్రుస్టమైన ఘనమైన గతం కల భారత దెశ చరిత్ర, మహానుభావుల చరిత్ర, క్షేత్రాల చరిత్ర తెలియ చెప్పడమే మీ మందార మాల లక్ష్యం. సమస్త లోక సుఖినోభవంతు.