అందరికీ నమస్కారం.. 🙏
నా పేరు చారకొండ హుస్సేన్. నేను ప్రస్తుతం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వాచర్ గా పనిచేస్తున్నాను. ఉదయం లేవగానే నల్లమల అడవిలో సంచరిస్తూ ఉండడం దినచర్యలో భాగం. ఈ క్రమంలో ప్రతిరోజు నేను అడవిలో తిరుగుతూ ఆస్వాదించే ప్రతిక్షణాన్ని మీతో పంచుకోవాలని ఆలోచనతో ఈ ఛానల్ ను మొదలు పెడుతున్నాను. అడవి ఒడిలో ఉన్న కనువిందు చేసే ప్రదేశాలను, నేను ప్రత్యక్షంగా ఆస్వాదించే ప్రకృతి సౌందర్యాలను, అలాగే నాకు తెలిసిన విషయాలను ప్రతిరోజు వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకు వస్తాను. కాబట్టి, మీరు గనక ప్రకృతి ప్రేమికులైతే దయచేసి నా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ,మన చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, నేను పెట్టే ప్రతి వీడియో ని లైక్ చేసి, మీ అభిప్రాయాలను తెలియజేయండి. ధన్యవాదాలు🙏